Praja Deveena
Newspaper Banner
Date of Publish : 24 December 2025, 2:38 pm Posted by : praja deveena

Rachakonda CP Sudheer Babu : రాచకొండ సీపీ సుధీర్ బాబు హెచ్చ రిక, మైనర్లకు మద్యం అమ్మితేకఠిన చర్యలు

— ఇన్సిడెంట్ ఫ్రీ ఇయర్ గా మంచి వాతావరణంలో వేడుకలు

–న్యూఇయర్ వేడుకల్లో ఔట్ డోర్ ఈవెంట్లలో డీజేకు అనుమతి లేదు

Rachakonda CP Sudheer Babu : ప్రజా దీవెన, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రా చకొండ పరిధిలో ఎటువంటి అవాం చనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యల గు రించి బుధవారం రాచకొండ కమిష నర్ సుధీర్ బాబు రాచకొండ పరిధి లోని పబ్ లు, బార్లు, రెస్టారెంట్స్, ఫామ్ హౌస్ లు, వైన్ షాపులు, ఈ వెంట్ ఆర్గనైజేషన్ నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో రాచకొండ పరిధిలోని డీసీపీలు, అడిషనల్ డీ సీపీలు, అన్ని పోలీస్ స్టేషన్ల ఇన్స్పె క్టర్లు కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లా డుతూ ఇన్సిడెంట్ ఫ్రీ న్యూ ఇయర్ గా జరుపుకోవాలని కోరుకుంటు న్నాను. ఆరోజు ఒక్క యాక్సివెంట్ కూడా జరగకూడదు.. ఏ ప్రాణం పోగుడదు, భూమి పై రక్తం చింద కూడదని కోరుకుంటున్నానని ఆకా క్షించారు. నూతన సంవత్సర వేడు కల సందర్భంగా ఎటువంటి అవాం చనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ బాధ్యతాయుతంగా సహకరించాలని కోరారు. ఈ వేడు కలలో ప్రజలు, యువత ఎంతో ఉ త్సాహంగా పాల్గొంటారని, కాబట్టి శాంతి భద్రతల సమస్య రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటు న్నామని పేర్కొన్నారు. ట్రాఫిక్, ఎస్ ఓటి, షి టీమ్స్, పెట్రోలింగ్ వంటి పో లీసు బృందాలు వేడుకల సందర్భం గా ఎటువంటి అవాంచనీయ సం ఘటనలు, నేరాలు జరగకుండా వి ధుల్లో ఉంటారని పేర్కొన్నారు.

ఔట్ డోర్ కార్యక్రమాలు జరిగే చోట డీజే బాక్సులకు అనుమతి లేదని, ఎటువంటి బాణసంచా కాల్చడానికి వీల్లేదని, పరిమితికి మించి ఈవెం ట్ లోకి ప్రేక్షకులను అనుమతించ కూడదని పేర్కొన్నారు. మహిళలపై ఎటువంటి వేధింపులు జరగకుండా నిరోధించడానికి తమ షి టీమ్ బృం దాలు విధుల్లో ఉంటారని పేర్కొ న్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టడానికి తమ బృందాలు తనిఖీలు చేస్తార ని, నిషేధిత డ్రగ్స్ సరఫరా చేసే ముఠాల మీద ఉక్కుపాదం మోపు తున్నామని పేర్కొన్నారు.

పబ్ లు, బార్లు, వైన్ షాపులు నిర్దే శిత సమయం లోపు మూసి వేయా లని, మైనర్ యువతకు మద్యం అ మ్మే దుకాణాలపై కఠిన చర్యలు ఉం టాయని హెచ్చరించారు. వాహనా ల పార్కింగ్ కు సరైన ఏర్పాట్లు చే యాలని, షాపులు, పబ్ లు, రెస్టా రెంట్ ల పరిసరాల్లో సీసీటీవీ లు ఖ చ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నగర శివార్లలో ఉం డే ఫామ్ హౌస్ లలో ఏర్పాటు చేసే కార్యక్రమాలు కూడా నిబందనలకు లోబడి ఉండాలని, ఎటువంటి డ్ర గ్స్ వినియోగం జరగకూడదని, మ హిళలతో అసభ్యకర డాన్స్ ప్రోగ్రా మ్స్ నిర్వహించకూడదని పేర్కొ న్నారు.

రోడ్ల మీద ట్రాఫిక్ ఇబ్బందులు రా కుండా ట్రాఫిక్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని, డ్రంకెన్ డ్రైవింగ్ పరీ క్షలు కట్టుదిట్టంగా అమలు చేయా లని సూచించారు. మైనర్లకు వా హ నాలు ఇచ్చే వాహన యజమానుల మీద కఠిన చర్యలు తీసుకుం టామ ని హెచ్చరించారు. అర్థరాత్రి యువ కులు నిర్లక్ష్యంగా అధిక వేగంతో వా హనాలు నడపకుండా మరియు ఎ టువంటి బైక్ రేసులు చేయకుండా ఉండేందుకు నిర్దేశిత సమయం పా టు తాత్కాలికంగా ఫ్లై ఓవర్ లను మూసివేయడం జరుగుతుందని పే ర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మహేశ్వరం డీసీ పీ నారాయణ రెడ్డి, ఎల్ బి నగర్ డీసీపీ అనురాధ, మల్కాజిగిరి డీసీ పీ సీహెచ్ శ్రీధర్, యాదాద్రి డీసీపీ ఆకాంక్ష్ యాదవ్, ఎస్ఓటి డీసీపీ రమణ రెడ్డి, డీసీపీ అడ్మిన్ ఇందిర, ఎస్బి డీసీపీ జి నరసింహారెడ్డి, విమె న్ సేఫ్టీ డీసీపీ ఉషా రాణి, ట్రాఫిక్ డీ సీపీ శ్రీనివాస్, రోడ్ సేఫ్టీ డీసీపీ మ నోహర్, డీసీపీ హెడ్ క్వార్టర్ శ్యామ్ సుందర్ ఇతర అధికారులు పాల్గొ న్నారు.