Rahul as MP again..! మళ్లీ ఎంపి గా రాహుల్..!
-- పార్లమెంటు సభ్యత్వం పునరుద్దరణ -- న్యాయ పోరాటంలో నిలిచి గెలిచిన రాహుల్ గాంధీ -- ఉత్తర్వులు జారీ చేసిన లోక్ సభ కార్యదర్శి
మళ్లీ ఎంపి గా రాహుల్..!
— పార్లమెంటు సభ్యత్వం పునరుద్దరణ
— న్యాయ పోరాటంలో నిలిచి గెలిచిన రాహుల్ గాంధీ
— ఉత్తర్వులు జారీ చేసిన లోక్ సభ కార్యదర్శి
ప్రజా దీవెన /న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు గందరగోళం మొత్తానికి సద్దుమణిగింది. దాదాపు ఐదారు నెలలుగా తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగి ఎట్టకేలకు ముగిసింది. సోమవారం సమావేశాలు ప్రారంభానికి ముందే లోక్‌సభ సెక్రటేరియట్ నోటీసు జారీ చేసి కాoగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. మోదీ ఇంటిపేరు కేసులో రాహుల్ గాంధీకి సూరత్‌లోని కోర్టు 2 సంవత్సరాల శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆగస్టు 4న ఉత్తర్వులు వెలువడిన తర్వాత రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించారు.
ఐదు నెలలుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న న్యాయపోరాటం మొత్తానికి ఫలించింది. మోదీ ఇంటి పేరు పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. 2019 ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ దాఖలు చేసిన పరువు నష్టం కేసు దాఖలు చేశారు. నీరవ్‌మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ – ఇలా దొంగలందరికీ ఇంటి పేరు మోదీ ఉందేంటి అని రాహుల్ గాంధీ ఏప్రిల్ 13, 2019న కర్నాటకలోని కోలార్ ఎన్నికల సభలో వ్యాఖ్యానించారు. మోదీ అనే ఇంటి పేరున్న అందరినీ రాహుల్ గాంధీ అవమానించారని పూర్ణేష్ మోదీ ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు.
రాహుల్‌కి సుప్రీంకోర్టు నుంచి ఊరట
దీన్ని విచారించిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి మార్చి 23, 2023న రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అప్పీల్ చేసుకునేందుకు వీలుగా శిక్షను నెల రోజులపాటు నిలుపుదల చేసింది. దానిపై నాలుగు నెలలుగా రాహుల్ గాంధీ సూరత్ జిల్లా కోర్టు, గుజరాత్ హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేశారు. శిక్ష విధిస్తూ మేజిస్ట్రేట్ తగిన కారణాలు చూపలేదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఆ శిక్షపై స్టే విధించింది. దీంతో రాహుల్ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటరీ పునరుద్ధరించారు.