–ప్రొటెం స్పీకర్‌కు సోనియా లేఖ వెనువెంటనే ఆమోదo
–సుదీర్ఘ కాలం పదేళ్ల తర్వాతే లోక్‌సభలో ప్రతిపక్ష నేత
–విస్త్రుత స్థాయి సమాలోచనల తర్వాత రాహుల్ అంగీకారం
Rahul Gandhi:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: లోక్ సభ లో ప్రతిపక్ష హోదా లేకుండానే పదే ళ్లు గడిచిపోయింది. అధికార ఎన్డీఏ (NDA) ప్రభుత్వం ఈ పదేళ్లు ఏకచిత్రాధిప త్యంగా లోక్ సభ లో ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ క్రమంలో 202 4 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా ప్రతి పక్ష హోదా దక్కిం చుకోవడంతో ఈ దఫా లోక్సభ లో ప్రతిపక్ష నేత పాత్ర కొలువుదీరనుంది. లోక్‌సభలో విపక్ష నేతగా కాం గ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కొనసాగనున్నారు. దశాబ్ద కాలం తర్వాత మళ్లీ లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కిగా రా హుల్ ఆ పాత్ర పోషించనున్నారు. బలమైన నేతగా ప్రధాని నరేంద్ర మోదీని దీటుగా ఎదుర్కొగలడన్న ఏకాభిప్రాయంతో రాహుల్ ను ఈ నెల 9న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కూడా విపక్ష నేత విషయంలో ఏకగ్రీవంగా తీర్మా నించిoది కూడా. అయితే ఆ సమ యంలో రాహుల్ మాత్రం తాను ఇంకా ఆలోచించుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిం దే. బుధవారం జరగనున్న లోక్‌సభ స్పీకర్ (Speaker of the Lok Sabha)ఎన్నిక విషయంలోనూ ప్రతి పక్షాలకు డిప్యూటీ స్పీక ర్ పదవిని కేటాయించాలనే సంప్రదాయం అం శంలోనూ మోదీనిరాహుల్ దీటుగా ఎదుర్కోగలరని మంగళవారం రాత్రి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివా సంలో జరిగిన విపక్ష కూటమి సమా వేశం పునరుద్ఘాటించింది.
దీంతో ఎట్టకేలకు ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగేందుకు రాహుల్ (RAHUL)తన ఆ మోదాన్ని ప్రకటించారు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌ప ర్సన్ సోనియాగాంధీ (Sonia Gandhi) ప్రొటెం స్పీకర్ భర్తృహరికి రాహుల్‌ను తమ పార్టీ తరఫున ప్రధాన ప్రతిపక్ష నేతగా పేర్కొంటూ లేఖ రాశారు. ఇదిలా ఉంటే గడిచిన పదేళ్లుగా లోక్‌సభ లో విపక్ష నేత హోదా ఖాళీగా ఉన్న విషయం విదితమే. కాగా ఏదైనా పార్టీ లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదాను పొందాలంటే మొత్తం సీట్లలో పది స్థానాల్లో గెలిచి ఉం డాలి. ప్రస్తుతం లోక్‌సభలో 543 సీట్లు ఉండగా ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే 54 సీట్లు తప్ప నిసరి కాగా 2014 సార్వత్రిక ఎన్ని కల్లో మోదీ ప్రభంజనంతో కాంగ్రెస్ 44 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చిం ది. 2019లో సైతం కాంగ్రెస్ పార్టీ 52 స్థానాలను దక్కించుకోగా ప్రధాన ప్రతిపక్ష హోదాకు రెండు సీట్లు త క్కువై మళ్ళీ చేజారింది. ఎట్టకేలకు పదేళ్ళ తర్వాత ఈ సారి 99 మంది ఎంపీలుండడంతో కాంగ్రెస్ ప్రతి పక్ష హోదాను దక్కించుకుంది.
ప్రతి పక్ష నేతకు సభా హక్కులు… లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతకు ప్రత్యేక సభా హక్కు లుండనున్నాయి. లోక్ సభలో (LOKSHABA) స భ్యులకు సీట్లు, గదుల కేటాయిం పులు, అధికారిక పత్రాల సరఫరా, పార్లమెంటరీ కమిటీల నియామకం, సభ రోజువారీ కార్యక లాపాల్లో కీల క పాత్ర పోషిస్తారు. సీబీఐ చీఫ్, చీఫ్ విజిలెన్స్ కమిషనర్, కేంద్ర సమాచార హక్కు కమిషనర్, ఎన్ని కల ప్రధాన కమిషనర్, ఇతర కమి షనర్ల నియామకానికి సంబం ధించి న ప్యానెళ్లలోనూ ప్రధాన ప్రతి పక్ష నేత సభ్యుడిగా ఉంటారు. వీటితో పాటు లోక్‌సభలో ప్రజల గళాన్ని వినిపించే అవకాశం విపక్ష నేత కు అధికంగా ఉంటుంది. జోడో యా త్రల సందర్భంగా రాహుల్ అనేక వర్గాలను కలిసి ఎన్నికల సమ యంలో కాంగ్రెస్ కూడా నిరుద్యో గిత, ధరల పెరుగుదల, మహిళా సమానత్వం, సామాజిక న్యాయం పై హామీలు ఇచ్చింది. ఈ అంశాలపై పార్లమెంట్‌లో గళమెత్తాల్సిన అవ రమున్నoదున రాహుల్ వల్లే సాధ్య మని, ఎన్నికల ప్రచారంలో నూ మోదీని రాహుల్ దీటుగా ఎదు ర్కొన్నారని కాంగ్రెస్ సంస్థాగత వ్యవ హారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ (KC Venu Gopal) వ్యాఖ్యానించారు.