Rahul Gandhi:న్యూఢిల్లీ : ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)మంగళవారం పార్ల మెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)నిప్పులు చెరిగారు. ఇది కుర్చీని కాపాడుకునే బడ్జెట్ అని దుయ్యబట్టారు. ఈ బడ్జెట్ (budget) తన మిత్రపక్షాలను సంతోషపెట్టేలా ఉందని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలను పణంగా పెట్టి బడ్జెట్లో తమ మిత్రపక్షాలకు బూటకపు వాగ్దానాలు చేశారని మండిపడ్డారు. తన స్నేహితులను సంతోషపెట్టడం కోసమే ఈ బడ్జెట్ ను తీసుకొచ్చార ని, దీని నుంచి అదానీ, అంబానీ ప్రయోజనం పొందుతారని పేర్కొ న్నారు. ఎప్పట్లాగే ఈసారి కూడా సామాన్య భారతీయుడికి ఎలాంటి ఉపశమనం లభించలేదని చెప్పా రు. ఇదొక కాపీ పేస్ట్ బడ్జెట్ అని కాంగ్రెస్ మేనిఫెస్టో (Congress Manifesto,), గత బడ్జెట్లను కాపీ కొట్టారని ఎక్స్ వేదికగా ఆయ న విమర్శించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.