–ఎన్ కౌంటర్ లో ఆర్మీ అధికారుల మరణం బాధ్యత ప్రభుత్వoదే
–కశ్మీర్ వ్యాలీలో వరుస ఉగ్రవాద దాడులపై ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ
Rahul Gandhi:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లోని దోడా జిల్లాలో ఉగ్రవా దులతో జరిపిన ఎన్కౌంటర్లో ఉన్నతాధికారి సహా నలుగురు సైని కులు మరణించిన ఘటనలకు కేం ద్ర ప్రభుత్వమే బాధ్యత వహిం చాలని లోక్ సభ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కశ్మీర్ వ్యాలీలో Kashmir Valley) వరుసగా చోటు చేసుకుంటున్న ఉగ్రవాద దాడులపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఉగ్రదాడులు ఒక దాని తర్వాత ఒకటి చోటు చేసు కోవడం చాలా భయాందోళనలకు గురి చేస్తుందన్నారు. ఈ వరుస ఉగ్రవాద దాడులతో జమ్మూ కశ్మీర్ లోని పరిస్థితులకు అద్దం పడుతుం దని తెలిపారు.భద్రతా లోపాల కార ణంగా ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటు న్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఘట నలకు కేంద్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత వహించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. నింది తులపై కఠిన చర్యలు తీసుకోవా లని కేంద్ర ప్రభుత్వానికి ఈ సంద ర్బంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi)సూచించా రు.
బీజే పీ (bjp)తప్పుడు విధానాల కార ణంగా సైనికులు, వారి కుటుంబాలు బల వుతున్నాయని ఆయన ఆవేద న వ్యక్తం చేశారు. దేశానికి, సైనికుల కు హాని చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దేశంలోని ప్రతీ దేశభ క్తుడు డిమాండ్ (demand)చేస్తున్నాడన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉగ్రవాదాని కి వ్యతిరేకంగా దేశం మొత్తం ఏకతా టిపై నిలబడిందని రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పష్టం చేశారు.మరోవైపు ఈ ఘట నపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గే స్పందించారు. ఉగ్రవాదులతో (Terrorists) జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు సైనికు మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గత 36 రోజులుగా ఉగ్రవాదదా డు లు వరుసగా జరుగుతున్నా యని గుర్తు చేశారు. ఇటువంటి నేపథ్యం లో ప్రభుత్వం వ్యూహాత్మ కంగా వ్య వహరాల్సి ఉందని ఆయన అభిప్రా యపడ్డారు. అయితే మోదీ ప్రభు త్వం ప్రతీ దానిని వ్యాపారాత్మక ధోరణితో చూస్తుందన్నారు. అందు లో మాత్రం మార్పు రావడం లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పేర్కొన్నారు. జమ్ము ప్రాంతం లో ఈ తరహా ఘట నలు ఇటీవల అత్యధికంగా చోటు చేసుకుంటు న్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.