–మానసికంగా కూడా ప్రధాని బలహీనపడ్డాడు
— జమ్మూ కాశ్మీర్ ఎన్నికల సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
Rahul Gandhi: ప్రజా దీవెన, జమ్మూ కాశ్మీర్ : మానసికంగా ప్రధాని నరేంద్ర మోదీ (modi) పతనం ప్రారంభమైందని లోక్‌స భలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) వ్యాఖ్యానిం చారు. లోక్‌సభలో మోదీ ఎదురుగా కూర్చునే తాను ఆ విషయాన్ని స్పష్టంగా గ్రహించ గలిగినట్లు చెప్పారు. ఇటీవలి లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని ఆత్మవిశ్వాసాన్ని కోల్పో యారని పేర్కొన్నారు. త్వరలో ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం తొలగిపోతుందని జోస్యం చెప్పా రు. ఇద్దరు ధనికుల కోసం ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేసి, జమ్మూక శ్మీర్ రాష్ట్ర హోదాను లాగేసుకు న్నారని విమర్శించారు. స్వతం త్ర భారత దేశంలో ఒక రాష్ట్ర హోదా ను లాగేసుకోవడం ఇదే తొలిసారి అని గతంలో కేంద్ర పాలిత ప్రాంతా లు రాష్ట్ర హోదాను సాధించాయని గుర్తుచేశారు.
బుధవారం ఆయన జమ్మూకశ్మీర్‌లోని బనిహాల్ అసెం బ్లీ సెగ్మెంట్ (Assembly segment) పరిధిలో ఎన్నికల ప్రచా రంలో భాగంగా జరిగిన ర్యాలీలో మాట్లాడారు. ‘‘ప్రస్తుతం మోదీ, అమిత్‌షా, వారి కార్పొరేట్ మిత్రు లు కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతు న్నారు. మోదీ హయాంలో నిరుద్యో గిత పెరిగింది. జీఎస్టీ, నోట్ల రద్దు కారణంగా చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మో దీ మిత్రులుగా చెప్పే అదానీ, అం బానీల పేర్లను నేరుగా చెప్పకూడ దని నాకు ఆదేశాలున్నాయి. అం దుకే నేను వారిని ఏ1, ఏ2 అని పిలుస్తాను. ఈ ప్రభుత్వం తీరు మేమిద్దరం–మాకిద్దరు(మోదీ, షా – అదానీ, అంబానీ) అన్నట్లుగా ఉంది. ఈ నలుగురు కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని రాహుల్ విమర్శించారు.
భారత్ లోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే (cpmpare)జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు దారు ణంగా ఉన్నాయన్నారు. కులగణన పై మోదీ అసలు ఆ అవసరం లేదం టారని, కానీ, ఆరెస్సెస్ మాత్రం అది సరైందేనంటుందని ఎద్దేవా చేశారు. ‘‘ఇంతకు ముందు ఎన్ని కల్లో మీరు చూసే ఉంటారు. మోదీ (modi) విశాలమైన ఛాతీతో వచ్చేవారు. ఇప్పుడు మాత్రం రాజ్యాంగాన్ని వెంటబెట్టుకుని వస్తున్నారు. మోదీ తనకు తాను నేరుగా దేవుడితో సం బంధం ఉందని చెప్పుకొంటారు. మోదీ దేవుడితో నేరుగా మాట్లా డొచ్చేమో కానీ, జమ్మూకశ్మీర్ ఎన్ని కల విషయంలో మాత్రం దేవుడు మాత్రం ప్రజల మాటే వింటాడు’’ అని రాహుల్ అన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణకు కృషి చేస్తామ న్నారు.