Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Rahul Gandhi: విద్యా శాఖ మంత్రిపై రాహుల్ గాంధీ గరం గరం

–భార‌త ప‌రీక్ష వ్య‌వ‌స్థే ప‌చ్చి మోసం అంటూ ఆరోప‌ణ‌
–డ‌బ్బున్న‌వాళ్లు చేతుల‌లో విద్యా వ్య‌వ‌స్థ‌,అన్ని ప‌రీక్ష‌ల ప్ర‌శ్న ప‌త్రాలు మార్కె ట్ లో అమ్మ‌కం
–పేదోడికి ఎప్ప‌టికీ దొర‌క‌ని ఉన్న‌త విద్య‌,మంత్రి రాజీనామా చేయ‌ల్సిం దే
–లోక్ స‌భ‌లో విప‌క్షాలు ఉమ్మడి డిమాండ్

Rahul Gandhi:ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: భార‌త ప‌రీక్ష వ్య‌వ‌స్థ (Indian Examination System)పచ్చ మోసం అంటూ లోక్ స‌భ లో విప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కేంద్రంపై ధ్వ‌జ‌మెత్తారు. సోమవారం ప్రారంభ‌ మైన బడ్జెట్ సమావేశాల‌లో( budget meeting) దేశ వ్యాప్తంగా దుమారం సృష్టిస్తోన్న నీట్‌ పేపర్ లీక్ అంశం చర్చకు వచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నీట్ అంశంపై మాట్లాడుతుంటే విపక్షాలు నిరసన వ్యక్తంచేశాయి. ప్రతిపక్ష ఎంపీల నినాదాలతో సభ లో గందరగోళ వాతావరణం నెలకొంది. మరోవైపు ఈ అంశంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేం ద్రంపై విమర్శలు గుప్పించారు.

పేప‌ర్ లీక్ (Paper leak)ల‌తో విద్యార్ధుల భ‌వి ష్య‌త్ తో ఆడుకుంటున్నార‌ని మండిప‌డ్డారు.విద్యావ్యవస్థను నాశనం చేశారని, పేపర్ లీకేజీలో రికార్డ్ సృష్టించారంటూ మండి పడ్డారు. నీట్ పరీక్ష కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేవని, పేపర్ లీక్ చాలా పెద్ద సమస్య అని సభ దృష్టి కి తీసుకొచ్చారు. డబ్బున్నోళ్లు విద్యా వ్యవస్థను కొనేస్తున్నారని ఆరో పించారు. ఈ సమస్యను మూలా లనుంచి పెకిలించాలని సూచిం చారు. దేశంలో పరీక్ష విధానాలపై అనుమానాలు మొదలయ్యాయని అన్నారు.

ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan)భాధ్య తగా రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షపై కేంద్రం బాధ్య త వహించాలన్నారు. ధనవంతులే పేపర్లు కొనుక్కుని డాక్టర్లు అవుతు న్నారని మండిపడ్డారు.ఈ పేపర్‌ లీక్‌లపై (paper leak)విద్యాశాఖ మంత్రి మాట్లా డుతూ గత ఏడేళ్ల కాలంలో పేపర్‌ లీక్‌ జరిగిన దాఖలాలు లేవని, ఎన్టీఏ ఇప్పటివరకు 240 పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం నీట్ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగు తోందని వెల్లడించారు.ఈ ప్రభుత్వం పేపర్‌లీక్‌ల విషయంలో రికార్డు సృష్టిస్తుందని ఎస్పీ అధినేత అఖి లేశ్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు విసి రారు. ప్రధాన్‌ విద్యాశాఖ మంత్రిగా ఉన్నంతకాలం విద్యార్థులకు న్యా యం దక్కదన్నారు.ఇదిలాఉంటే కావడి (కన్వర్‌) యాత్ర మార్గంలో హోటళ్లపై యజమానుల పేర్లు రాయాలంటూ ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభు త్వం తీసుకువచ్చిన నిబంధనను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. దీని పై చర్చ జరపాలంటూ రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు ఇచ్చిన నోటీసుల ను ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ తిర స్కరించారు.