–ఐఎండి అత్యున్నత స్థాయిఅలర్ట్
–దేశంలో 17 రాష్ట్రాలకు హెచ్చరిక
–ఢిల్లీ సహా ఆయా రాష్ట్రాలకు ఐ ఎండీ వర్ష సూచనలు జారీ
–అత్యంత అప్రమత్తత అవసరమ ని దిశా నిర్దేశం
Rain Alert: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఆగస్టు నెలలో రుతుప వనాలు చురుగ్గా ఉన్న క్రమంలో వర్షాలు (rains) విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ (delhi) సహా 17 రాష్ట్రా లకు ఐఎండీ వర్ష సూచనలు జారీ చేసింది.ఉన్న క్రమంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ (delhi) సహా 17 రాష్ట్రా లకు ఐఎండీ వర్ష సూచనలు జారీ చేసింది. ఇప్పటికే ఢిల్లీ చుట్టు పక్క ల నగరాల్లో నిన్న జోరు వాన కురి సింది. ఈ క్రమంలో ఢిల్లీలో (delhi) నేడు, రేపు కూడా భారీ వర్షాలు కురుస్తా యని వాతావరణ శాఖ హెచ్చరిం చింది. ఈ నేపథ్యంలో రానున్న 24 గంటల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్, ఒడి శా, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళ నాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, (Delhi, Chandigarh, Haryana, Punjab, Rajasthan, Himachal Pradesh, Uttar Pradesh, Madhya Pradesh, Chhattisgarh, Bihar, Jharkhand, Odisha, West Bengal, Kerala, Tamil Nadu, Andhra Pradesh, Telangana,) లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, గుజరాత్‌లలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఆయా అనేక రాష్ట్రాల్లో
ఇక ఆగస్టు 15న కర్ణాటక, కేరళ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జార్ఖం డ్, అస్సాం, మేఘాలయ, నాగా లాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, జమ్ము, హర్యానా, ఛత్తీ స్‌గఢ్ , ఢిల్లీలో భారీ వర్షాలు కురు స్తాయని వాతావరణ శాఖ హెచ్చ రించింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. దేశ రాజధాని ఢిల్లీలో వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్‌లతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే వర్షపు నీటిలో మునిగి ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ మృ తి చెందారు.
ఆరెంజ్ అలర్ట్ ఆదేశాలు
అంతేకాకుండా, కేరళ, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్‌లలో కూడా పగటిపూట భారీ వర్షాలు (heavy rains) కురుస్తాయని ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. పశ్చిమ హిమాలయ ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉన్నాయ ని ఐఎండీ వెల్లడించింది. ఈ నేప థ్యంలో వాయువ్య భారతదేశం లోని మైదానాలలో చాలా విస్తృ తమైన వర్షపాతం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో నే ఆగస్టు 18 వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో భారీ వర్షాలు ఉంటా యని ఐఎండీ అంచనా వేసింది హర్యానాలో ఆగస్టు 16 వరకు, జమ్మూ కశ్మీర్లో రాబోయే మూడు రోజులు, పంజాబ్‌లో ఆగస్టు 14న వర్షాలు కురియనున్నట్లు వెదర్ రిపోర్ట్ తెలిపింది.
అప్రమత్తత అవసరం
మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో గంగా, యమునా నదులు (Ganga and Yamuna rivers) ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో 30కి పైగా జిల్లాలు వరదల్లో మునిగి పోయా యి. గంగానది ఘాట్లు కూడా నీట మునిగాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిం చారు. రాజస్థాన్‌లో వర్షాల కార ణంగా 3 రోజుల్లోనే 25 మందికి పైగా మరణించారు. ఇంకోవైపు కొండచరియలు విరిగిపడటంతో హిమాచల్ ప్రదేశ్‌లో 200కు పైగా రోడ్లు మూసుకుపోయాయి. జులై 27 నుంచి ఆగస్టు 12 వరకు హిమాచల్‌లో రూ. 1000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో పాటు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు.