Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nalgonda District Collector Ila Tripathi : ముసాయిదా ఓటరు జాబితాపై అ భ్యంతరాలుoటే అప్పీల్ చేయండి

–600 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు

–సెప్టెంబర్ 2న తుది ఓటర్ జాబిత

–రాజకీయ పార్టీల సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Nalgonda District Collector Ila Tripathi :

ప్రజాదీవెన, నల్లగొండ: గ్రామపంచా యతీ ఎన్నికల దృష్ట్యా రూపొందిం చి ప్రచురించిన ముసాయిదా ఓ ట రు జాబితా, ముసాయిదా పోలింగ్ కేంద్రాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 30 లోగా తెలియజే యాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నీ రాజకీయ పక్షాల ప్రతినిధుల తో కోరారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ చాంబర్లో గ్రామపంచాయతీ వార్డుల వారీగా ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితా తయారీ, ప్రచుర ణ, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచు రణ పై అన్ని రాజకీయ పార్టీల ప్రతి నిధులతో సమావేశం నిర్వహించా రు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదే శా ల మేరకు ఈనెల 28 న సంబంధిత ఎంపీడీవోల ద్వారా మండల కేం ద్రా లు, గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ముసా యిదా ఓటరు జాబితా ప్రచురించ డం జరిగిందని, ఈ ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాలపై రాజకీయ పార్టీలు అ భ్యంతరాలను ఈ నెల 28 నుండి 30 వరకు సమర్పించవచ్చని, వచ్చి న అభ్యంతరాలను ఈనెల 31న పరిశీలించి, పరిష్కరించడం జరు గుతుందని తెలిపారు.

తుది ఓటరు జాబితాను సెప్టెంబర్ 2న ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. నేడు ఎంపీడీవోల ద్వా రా మండల స్థాయిలో అన్ని రాజ కీయ పార్టీల ప్రతినిధులతో సమావే శం ఏర్పాటు చేయడం జరుగుతుం దని, ఆ సమావేశంలో పోలింగ్ కేం ద్రాలు, ఓటరు జాబితాపై అభ్యంత రాలు తెలపవచ్చని కలెక్టర్ సూచిం చారు. తుది ఓటరు జాబితా రూప కల్పనకు రాజకీయ పార్టీలు సహక రించాలని కోరారు. నల్గొండ జిల్లా లో 869 గ్రామ పంచాయతీలు ఉం డగా, 7494 పోలింగ్ కేంద్రాలు ఏ ర్పాటు చేయడం జరిగిందని, ము సాయిదా ఓటరు జాబితా ప్రకారం 10 లక్షల 73,506 మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.జిల్లాలో 600 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రా న్ని ఏర్పాటు చేయడం జరిగిందని, అవసరమైతే ఆక్సిలరీ పోలింగ్ కేం ద్రాలు ఏర్పాటు చేసే అధికారం ఉం టుందని వివరించారు.

మిర్యాలగూడ సబ్ కలెక్టర్ స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా ఉప ఎన్ని కల అధికారి నారాయణ అమిత్ ముసాయిదా ఓటరు జాబితా, పో లింగ్ కేంద్రాల జాబితా ప్రక్రియను వివరించారు. ఈ సమావేశానికి బి ఆర్ఎస్ నుండి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మల్లికార్జున్, పంకజ్ యాదవ్, పిచ్చయ్య, బిజెపి నుండి లింగస్వామి, బిఎస్పీ నుండి యాదగిరి, టిడిపి తరఫున రఫీక్, సి పిఐ(ఎం) తరఫున హాజరైన న ర్సిరెడ్డిలు పలు సూచనలు చేశారు.     ముసాయిదా ఓటరు జాబితా కాపీ లను రాజకీయ పార్టీల ప్రతినిధు ల కు ముందుగానే అందించాలని, డ బుల్ ఓటర్లను తొలగించాలని, ఏ వార్డులోని ఓటర్లు అదే వార్డులో ఉండేలా చూడాలని, ఒక ఇల్లు ఒకే వార్డులో వచ్చేలా చూడాలని, గ్రా మపంచాయతీ ఎన్నికలకు సంబం ధించి మండలాల వారిగా వాట్స్అ ప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని, అ భ్యంతరాల సమర్పణకు తేదీ పొ డి గించాలని, దీర్ఘకాలంగా పనిచేస్తు న్న గ్రామపంచాయతీ కార్యదర్శుల ను మార్చాలని కోరారు.ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి సైది రెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీ నుండి ఎస్కే అన్సారి, అద్దంకి రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి వెంక య్య, జెడ్పి సీఈవో శ్రీనివాస రావు, న ల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి తదిత రు లు ఈ సమావేశానికి హాజరయ్యా రు.