–మద్యంపాలసీకి వ్యతిరేకంగా సొం తపాలసీ అమలుకు నిర్ణయం
–రాజగోపాల్ రెడ్డి తీరు ప్రభుత్వా న్ని ఇరుకునపెడుతోన్న వైనం
–నియోజకవర్గంలో విచ్చలవిడికి మద్యాన్ని నిలువరించే ప్రయత్నం
–ఏడాదిన్నరగా ఓవైపు బెల్ట్ షాప్ ల నియంత్రణ చర్యలు విజయవంతం
–తాజాగా మద్యం పాలసీనే మా ర్చేందుకు కఠినతర నిర్ణయం
–ఎమ్మెల్యే సంచలన నిర్ణయంతో రాష్ట్రoలో విస్తృత చర్చనీయాంశం
–మునుగోడురాజన్న సొంతమద్యం పాలసీపై సర్వత్రా ఉత్కంఠ భరితం
Rajanna Rajyam : ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్ర వ్యా ప్తంగా మద్యం దుకాణాల వేలంకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన పాలసీ ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. మద్యం దుకాణాల వేలం లైసెన్స్ ఫీజు రూ.3 లక్షలకు పెరగ డంతో మద్యం వ్యాపారుల నుంచి విముఖత వ్యక్తం కావడంతో పాటు దరఖాస్తులు అంతకంతకు తగ్గుము ఖంపట్టి తీవ్రత చర్చ జరుగుతున్న తరుణంలో అటు ప్రభుత్వంలో, మ ద్యం వ్యాపారుల్లో విస్తృత చర్చ జ రుగుతున్న విషయం విధితమే. ఈ క్రమంలో మద్యం పాలసీకి సంబం ధించి నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం లో ఓ విధంగా ము సలం పుట్టిందని చెప్పవచ్చు. మ ద్యం బెల్టుషాపుల నిషేధంతో ఇ ప్పటికే రాష్ట్రవ్యాప్త ప్రచారంలో ఉ న్న మునుగోడు నియోజకవర్గం తా జా మద్యం టెండర్ల తరుణంలో మ రోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీ యాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త మద్యం పాలసీని జారీ చే యడం సదురు ప్రక్రియ ముందుకు సాగుతున్న సమయంలో మును గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గో పాల్ రెడ్డి తీసుకున్న సొంత మద్యం పాలసీ సoచలన నిర్ణయం ఒక్క సా రిగా మద్యం వ్యాపారులను ఉలిక్కి పాటుకు గురిచేసింది. నియోజకవ ర్గంలో మద్యం దుకాణాల నిర్వహ ణకు ప్రజల తరపు న షరతులు వి ధిస్తామని, వీటిని పాటించేవారే టెండర్లలో పాల్గొనా లని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బహిరంగ ప్రకటన చేయడం, ఆయ న అనుచరులు ఆ మేరకు ఎమ్మెల్యే ఎక్సైజ్ అధికారు లు సహక రించాలని కోరుతూ జిల్లా ఎక్సైజ్ సూపరిoడెంట్ కు వినతి ప త్రం అందజేయడం ఓ విధంగా ఆశ్చర్యానికి గురి చేయక మానదు.
ఎమ్మెల్యే నిర్ణయం పై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో…
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకున్న తాజా సొంత మద్యం పాలసీ నిర్ణయoపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అన్న ఆసక్తి సర్వత్ర నెలకొంది. మద్యం టెండర్ల నియమ నిబంధనల ప్రకా రం ఎక్కడి వారైనా మరెక్కడైనా షా పులకు దరఖాస్తు చేసుకు నే వెసు లుబాటు ఉన్నప్పటికీ రాజగోపాల్ రెడ్డి నిర్ణయంతో వ్యాపా రులు స మాలోచనల్లో పడ్డారు. దీంతో ఇటు ప్రభుత్వానికి లైసెన్స్ ఫీ జు రూపం లో వచ్చే ఆదాయం తో పాటు వ్యా పారంలో కూడా వచ్చే ఆదాయం గ ణనీయంగా తగ్గే పరిస్థితి ఉన్నందు వల్ల ప్రభుత్వం వై పు నుంచి ఎటు వంటి స్పందన రానుందన్న ఉత్కం ఠత సర్వత్ర నెలకొంది. ఇది ఇలా ఉండగా ప్రభుత్వ మద్యం పాలసీకి వ్యతిరే కం గా సొంత పాలసీని అమ లు చేయాలనడంలో ఎమ్మెల్యే రాజ గోపా ల్ రెడ్డి వ్యాఖ్యల్లో రాజకీయ కోణం కూడా తెర మీదకు వచ్చింది. ప్ర భుత్వంలో కొరకరాని కొయ్యగా తయారైన మునుగోడు ఎమ్మెల్యే రా జగోపాల్ రెడ్డి తాజాగా మద్యం పాలసీలో చేసిన వ్యాఖ్యలు అందు లో భాగమైన చర్చ కూడా లేకపోలే ద వినబడుతోంది.
ఏడాదిన్నరగా మద్యం బెల్ట్ షా పుల నియంత్రణ…. మునుగోడు నియోజకవర్గంలో గడిచిన ఏడాది న్నర నుంచి బెల్ట్ షాపులను ని యంత్రించే చర్యల్లో బాగంగా రాజగోపా ల్ రెడ్డి కొంతవరకు సక్సెస్ అయ్యా రని చెప్పవచ్చు. బెల్ట్ షాపుల ని యంత్రణ విజయవం తం గా కొనసా గుతున్న తరుణంలో ప్రభుత్వం మ ద్యం పాలసీని ప్రక టించడంతో తా జాగా మద్యం దుకాణాలను కూడా కొంతమేర కట్ట డి చేస్తే నియోజకవ ర్గంలో ప్రజలకు మేలుచేసిన వార మవుతా మ న్న ఆలోచనతో తాజా ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చినట్టు తెలు స్తోంది.
మద్యం మహమ్మారిని పారద్రోడమే ధ్యేయంగా… గ్రామాల్లో సా మాజికరుగ్మతగా మారి ప్రధానంగా యువకులు మద్యానికి బాని సలు అవుతున్న పరిస్థితులను గమనిం చిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గ్రామాల్లో విచ్చలవిడి మద్యం వ్యాపారాలను నియంత్రించాలని కంకణంకట్టుకున్నాడు. ప్రధానంగా తన నియోజకవర్గంలో పర్యటి స్తున్న పలు సందర్భాల్లో ఎందరో యువకులు చిన్నవయసులోనే మద్యా నికి బానిసైన విషయం తనదృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే రాజగోపాల రె డ్డి పలు సందర్భాల్లో బహిరంగం గా నే ఆవేదన వ్య క్తం చేసిన సందర్భా లు ఉన్నాయి. గత పదేళ్లలో గ్రామాల్లో సామాజి కరుగ్మతగా మ ద్య పానం మారిందన్నారు. కనీసం మునుగోడు ని యోజకవర్గంలోనైనా ఈ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో తొలుత బెల్ట్ దుకాణాల నిర్మూలన కు చర్యలు చేపట్టారు. ఇప్పుడు మ ద్యం విక్రయాల నియంత్రణకు ప్ర త్యేక కార్యాచరణ ప్రతిపాదించారు. ప్ర జలను ఆరోగ్యవంతులుగా ఉం చడం, మనిషి జీవన ప్రమాణాలు పెంచడమే తన లక్ష్యమని పేర్కొం టున్న ఎమ్మెల్యే, బెల్ట్ షాపుల నిర్మూలన, మహిళా సాధికారత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా మని, అంతేతప్ప ఎవరినీ ఇబ్బందులకు గురిచేయాలని కాదని స్ప ష్టం చేస్తున్నారు.
రాజగోపాల్ రెడ్డి సొంత పాలసీ వివరాలు ఇలా.. మునుగోడు ని యోజకవర్గంలో సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకే మ ద్యం విక్రయాలు చేయాలని ఎ మ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సూచి స్తు న్నారు. అదేవిధంగా గ్రామాల్లో కా కుండా ఊరుబయటనే మద్యం దు కాణాలు ఏర్పాటు చేయాలని, దు కాణాల వద్ద సిట్టింగులు ని ర్వ హించేది లేదని, కేవలం దుకాణమే న డపాలని ప్రతిపాదించా రు. అదేవి ధంగా బెల్ట్ షాపులను ఎట్టి పరిస్థి తుల్లో నడవనిచ్చేది లేదని హె చ్చరించారు. సిండికేట్లు ఉండవ ద్దని, బెల్టుకాణాలకు మద్యం విక్ర యించవద్దని స్పష్టం చేస్తున్నారు.
నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో వి స్తరించిన మునుగోడు నియోజక వ ర్గంలో ఏడు మండ లాలు, రెండు మునిసిపాలిటీలు కలిపి 29 మ ద్యం దుకాణాలు, నాలుగు బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. చౌటు ప్పల్ పట్టణంలో మూడు, చండూ రు పట్టణంలో ఒక బార్, చౌటు ప్ప ల్ మండలంలో 11 మద్యం దు కా ణాలు, సంస్థాన్ నారాయణ పురం మండలంలో మూడు, మునుగోడు, చండూరు మండలాల్లో నాలుగు చొ ప్పున, మర్రిగూడ, నాంపల్లి మండ లాల్లో మూడు చొ ప్పున, గట్టుప్పల్ లలో ఒక మద్యం దుకాణం కలిపి మొత్తం 29 వరకు ఉన్నాయి.
బెల్ట్ షాపుల సక్సెస్ తో మద్యం పాలసీపై ఆంక్షలు…ఇదిలా ఉం డగా నియోజకవర్గంలో విచ్చలవిడి గా మద్యం వినియోగాన్ని త గ్గించ డమే లక్ష్యంగా కార్యాచరణ మొ దలుపెట్టిన ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి ఏడాదిన్నర క్రితం 2024 మే నె ల నుంచి బెల్ట్ దుకా ణాల నిర్మూ ల నకు శ్రీకారం చుట్టారు. ఒక సం ద ర్భంలో ఆయన సైతం ఉదయం 10 గంటలకే మునుగోడులోని ఒక సి ట్టింగ్ వద్దకు వచ్చి ఉదయాన్నే మ ద్యం తాగడానికి వచ్చిన యువ కు డిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు. నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఒ క్కో గ్రామంలో 10 నుంచి 15 వరకు ఉన్న బెల్ట్ షాపులన్నింటినీ ఎత్తివేయించారు. విస్తృత స్థాయిలో పోలీ సులతో దాడులు చేయిం చడంతో కొన్ని నెలల పాటు బెల్ట్ దుకాణాల నిర్వహణ ఆశించిన స్థాయిలో కొనసాగింది.
పోలీస్ దాడులే తప్ప ఎ క్సైజ్ శాఖ నుంచి వీటి నిర్మూలనకు పూర్తి స్థాయిలో చర్యలు లేకపోవడం తో ఐదారు నెలల తర్వాత మళ్లీ పం డుగలు, జాతరలు, పార్టీల పేరు తో మెల్లగా కొన్ని కొన్ని గ్రామా ల్లో బె ల్ట్ దుకాణాలు పునః ప్రారంభమ య్యాయి. కాగా గతంలో మా దిరిగా బహిరంగంగా కాకుండా చాటుమా టుగా అక్కడక్కడ బెల్ట్ షాపులు ఇ ప్పటికీ కొనసాగుతున్నాయని తెలు స్తోంది. అయితే నేరుగా దుకాణాలు నడపకుండా మొబైల్ పద్ధతిలో, అ వుట్ డోర్ డెలివరీ పద్ధతిలో బెల్ట్ షాపుల నిర్వాహకులు మద్యం విక్రయిస్తు న్నారని ఆయా గ్రామస్థులు చెబుతున్నారు. పోలీసులకు సైతం దొర కకుండా పొలాల వద్ద, బావుల వద్ద ఏ రోజుకారోజు మద్యం నిల్వ చేసి అడిగిన మద్యంపై క్వార్టర్ కు అదనంగా వసూలు చేస్తు న్నా రని చెబుతున్నారు.
పదవి ఉన్నాలేకున్నా మునుగోడులో వైన్స్ లు నడవనివ్వను
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మరో మారు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళ వారం ఆయన మీడియాతో మాట్లా డుతూ మునుగోడు నియోజకవ ర్గంలో వైన్స్ నడవనివ్వ నని స్పష్టం చేశారు. పదవి ఉన్నా లేకున్నా ఒక టే అని, తనకు ప్రజ ల ఆరోగ్యమే ముఖ్యమని పునరుద్ఘాటించారు. టెండర్ వేసే వాళ్లు కచ్చితంగా నేను చెప్పిన నిబంధనలు పాటించాలన్నారు. సాయం త్రం 4 గంటల నుం చి 8 గంటల వరకే పర్మిట్ రూం లే కుండా వైన్స్ నిర్వహించాలని డి మాండ్ చేశారు.
దొంగ చాటుగా బెల్ట్ దుకాణా లకు సరఫరా, అధిక ధ రలతో సిం డికెట్‌గా మారి డూప్లికేట్ మద్యం అమ్ముతున్నారని ఎమ్మెల్యే ఘా టు వ్యాఖ్యలు చేశారు.ఊరి బయట ఉండాల్సిన వైన్ షా పులను సెంటర్లో పెడుతున్నారని మండిపడ్డారు. ఇతర జిల్లా, మండ లాల వారు మునుగోడు షాప్స్‌కు టెండర్ వేయొద్దని స్పష్టం చేశారు. ప్రజ ల ఆరోగ్యం మెరుగుపర్చేలా ఎ క్సైజ్ పాలసీని మార్చడంపై తెలం గాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా నని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గు ర్తు చేశారు.
Nalgonda district munugodu mla KomatiReddy rajagopalreddy shocking comments on Telangana liquor policy pic.twitter.com/4a044oKNJD
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) October 14, 2025