Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Rajiv Gandhi’s death anniversary: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి….

*రాజీవ్ గాంధీ ఆశయాలను సాధించాలి: రామారావు

Rajiv Gandhi’s death anniversary: ప్రజా దీవెన, కోదాడ: భారతదేశ మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. బుధవారం రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా పట్టణంలో రాజీవ్ చౌక్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ జీవితం దేశానికి అంకితం, యువతకు ఎన్నో మార్గదర్శకాలను దిశానిర్దేశం చేశాడని పార్టీ కోసం తన జీవితాన్ని అంకితం చేశాడని శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతకు పరిచయం చేసింది రాజీవ్ గాంధీ అని రాజీవ్ ను నేటి యువత ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల సాధన కోసం కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, డిసిసి ఉపాధ్యక్షులు పార.సీతయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ షేక్ బషీర్, సిహెచ్ శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్లు గంధం. యాదగిరి, మదర్, పాలూరి సత్యనారాయణ, ఈదుల కృష్ణయ్య,కాంపాటి శ్రీను,బాగ్దాద్, భాజాన్, పంది తిరపయ్య, బసవయ్య, సైదా నాయక్, అలీ భాయ్,ముస్తఫా, సంజీవ్, వీరబాబు, యాకూబ్,తదితరులు పాల్గొన్నారు.