★ఆరు గ్యారెంటీల పథకాలతో ప్రజల కలను నెరవేర్చనున్న కాంగ్రెస్ ప్రభుత్వం
★ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దు
★కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మునగాల రమణారెడ్డి
Ramana Reddy : ప్రజా దీవన,నారాయణ పూర్ : ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మునగాల రమణారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో మాట్లాడుతూ దశాబ్ద కాలం బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఏ ఒక్కరికి ఒక్క ఇల్లు రేషన్ కార్డు కూడా ఇవ్వని గత ప్రభుత్వం.ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందే విధంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని తెలిపారు.అన్ని గ్రామాల ప్రజలు గ్రామసభలలో అధికారులు చెప్పే విషయాలను పాటిస్తూ అధికారులు సలహాలు సూచనలు తీసుకోవాలని కోరారు.6 ఆరు గ్యారంటీలతో ప్రజల కలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని అన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధి చేకురు తుంది ప్రతిపక్ష నాయకులు ప్రజలను రెచ్చగొట్టి అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు ప్రజలని అయోమయానికి గురిచేసి గొడవలకు దారి తీస్తున్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు బయట ప్రజలకు తెలియకుండా వారి అనుకూల వ్యక్తులకు అందించారు.నేడు కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులను ప్రజలందరి సమక్షంలో గ్రామ సభలో చూపించి అర్హులకు పథకాలు అందేలా చేస్తుందని దీన్ని చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేసి ప్రజలను అయోమయ స్థితికి తీసుకొస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇకనైనా ఇలాంటి చర్యలు మానుకోవాలని ప్రతిపక్ష నాయకుల చర్యలను ఖండించారు.