Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Rakshasa Governance : రాష్ట్రం లో రాజరిక, రాక్షస పాలన

*ప్రశ్నించే వారిపై కేసులా..
*సీఎం రేవంత్ ఒక పెద్ద దద్దమ్మ..

*మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్

Rakshasa Governance : శాలిగౌరారం జూలై 3 : రాష్ట్రంలో రాజరిక, రాక్షస పాలన పాలన కొనసాగుతుందని, ప్రశ్నించేవారు పై కేసులు పెడుతూ సీఎం రేవంత్ రెడ్డి దుచర్య కు పాల్పడుతున్నాడని బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశం లో కిషోర్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో పోలీస్ వ్యవస్థను ఉపయోగించి నాయకులు ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ కాంగ్రెస్ నాయకులు భయాందోళనకు గురిచేస్తున్నారు.తాము ఉద్యమం నుంచి వచ్చామని, ఇవి కొత్తేమి కాదని,ఎలాంటి కేసులకైనా భయపడే ప్రసక్తే లేదన్నారు.ఇక నుంచి ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు పంగనామాలు, 420 హామీల ఎగనామాలు పెట్టి ప్రజలను మోసం చేసే పాలన చేస్తున్నారన్నారు.తెలంగాణ దిక్సూచి కేసీఆర్‌, కేటీఆర్ ల కుటుంబాలను తిట్టందే రేవంత్‌కు పూట కూడా గడవదన్నారు.తన గురువు చంద్రబాబు కళ్లలో ఆనందం చూడాలనే ఒకే ఒక లక్ష్యంతో రేవంత్‌రెడ్డి తెలంగాణ విద్రోహ పాలన సాగిస్తున్నారు….కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం అయ్యిందన్నారు.
నీళ్ల మంత్రికి చదువురాక ప్రతిరోజు కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు…
రాష్ట్రంలో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయిని వేసిన విత్తనాలు ఎండిపోతున్నా వ్యవసాయం శాఖ పై ఒక్కనాడు కు సమీక్షా సమావేశం నిర్వహించక పోవడం భాధాకరమన్నారు.

ఫోన్ టాపింగ్ కు ప్రభుత్వానికి ఏం సంబంధమని
వ్యక్తుల ప్రతిష్టలు దెబ్బతీయాలని ప్రభుత్వం ఫోన్ టాపింగ్ లో జోక్యం చేసుకుంటుందన్నారు.
మహా న్యూస్ కేటీఆర్ ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రచారాలు చేస్తున్నారు.
మహా న్యూస్ యాజమాన్యం కేసిఆర్ కు కేటీఆర్ కు క్షమాపణ చెప్పాలన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీ నదుల మీద, రాష్ట్ర పాలన మీద ఏ మాత్రం అవగాహన లేని దద్దమ్మ అన్నారు.
ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు అయితగోని వెంకన్న గౌడ్, మాజీ అధ్యక్షులు కట్టా వెంకటరెడ్డి, నాయకులు మామిడి సర్వయ్య,గుండా శ్రీనివాస్, గుజలాల్ శేఖర్ బాబు, దుబ్బ వెంకన్న,జేరిపోతుల చంద్రమౌళి, అక్కినేపల్లి శ్రీరాములు,భూపతి ఉపేందర్,శేషరాజపల్లి వెంకన్న, పాక రాములు,మహేశ్వరం వెంకన్న,గుండ్ల వెంకన్న, రాపాక రాజు, నిమ్మల సురేష్,తీగల వెంకన్న,రాచకొండ గణేష్, కమలాకర్,చీమల శ్రవణ్ కుమార్, నోముల శ్రీనివాస్,చింతల శంకర్,జలందర్, బడేసాబ్ తదితరులు ఉన్నారు.