బీజేపీ మహిళా మోర్చా ఆద్వర్యంలో
Rani Ahalyabai’s centenary: ప్రజా దీవెన,నల్గొండ టౌన్: రాణి అహల్య భాయి శత జయంతి వేడుకల సందర్భంగా 35వ వార్డు పద్మనగర్ లో చేనేత మహిళా కళాకారులకు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించి ఘన సన్మానం చేశారు..ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం,మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండేటి సరిత పాల్గొని ..రాణి అహల్య భాయి మహిళా శక్తికి నిజమైన నిదర్శనం అని వారు కొనియాడుతూ ,మహిళా సాధికారత కొరకు వారు అనేకమైన కార్యక్రమాలు నిర్వహించేవారిని తెలిపారు..
మూడు వందల సంవత్సరాల క్రితం 18వ శతాబ్దంలో ప్రశాంతమైన పరిపాలనతో,అత్యంత సాధికారతతో అత్యంత వైభవంగా ముఫై సంవత్సరాలు రాజ్యపాలన కొనసాగించిన మహా యోధురాలు అని కీర్తించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు రావెల కాశమ్మ, ఉత్సవ కన్వీనర్ నెవర్సు నీరజ,పట్టణ మహిళా అధ్యక్షురాలు గూగులోతు తార,మాజీ కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి,వెంకటేశ్వర్లు, సైదులు, నాగమణి,మహిళా నాయకురాల్లు తదితరులు పాల్గొన్నారు..