–ముమ్మర కసరత్తు కొనసాగుతోo దంటున్న అధికార యంత్రంగం
–ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎన్నో కుటుంబాలు
–రేషన్ కార్డుల జారికి సంబంధించి క్లారిటీ ఇచ్చిన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Ration cards:ప్రజాదీవెన, హైదరాబాద్: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు (Ration cards)అర్హత ఉండటంతో.. అవి లేకపోవడం వల్ల నిరుపేద కుటుంబాలకు పెద్ద ఆటంకంగా మారింది. దీంతో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.. ఈ క్రమంలో తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ (Uttam Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని తెలిపారు. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు వేర్వేరుగా ఇస్తామని తెలిపారు.
మంత్రివర్గంలో కొత్త రేషన్ కార్డు మార్గదర్శకాలపై చర్చిస్తామన్నారు. కొత్త రేషన్ కార్డులు ఎవరెవరికీ ఇవ్వాలన్నదానిపై చర్చించి.. మార్గదర్శకాలు ఖరారైన వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తామని ఉత్తమ్ తెలిపారు. రేషన్ కార్డు వేరేగా.. ఆరోగ్యశ్రీ కార్డు (Arogyasree card) వేరేగా ఇవ్వనున్నట్లు తెలిపారు. రేషన్ కార్డు రేషన్ కోసం.. ఆరోగ్యశ్రీ వైద్యం కోసం అని తెలిపారు. వాస్తవానికి చాలా కాలం నుంచి కొత్త రేషన్ కార్డులు అందించలేదు.. దీంతోపాటు కార్డుల్లో మార్పులు చేర్పులు ప్రక్రియ కూడా జరగలేదు.. దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి జనం రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి హామీ ఇచ్చినప్పటికీ.. ఇంకా ప్రక్రియ మొదలు కాలేదు. ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)క్లారిటీ ఇచ్చారు.