Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ration cards : రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు

–నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి, అడ్లూరి లక్ష్మణ్

Ration cards : ప్రజా దీవెన, పెద్దవూర: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు లు ఇస్తున్నామని రాష్ట్ర పౌరసరఫ రాలు, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు. మం గళవారం ఆయన నల్గొండ జిల్లా ఇ న్చార్జి మంత్రి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మై నార్టీ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి నల్గొండ జిల్లా పె ద్దవూర మండల కేంద్రంలో నిర్వ హించిన నూతన రేషన్ కార్డుల పం పిణీ కార్యక్రమానికి ముఖ్యఅ తిథి గా హాజరయ్యారు.

 

తమ ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాష్ట్రంలో 89 లక్షల రేషన్ కార్డులు ఉండేవని, రెండు కోట్ల 80 లక్షల మంది సభ్యులు ఉండేవారని, ఆ సంఖ్య ఇప్పుడు 97 లక్షలకు పెరి గిందని, మూడు కోట్ల 15 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని తెలి పారు.సమాజంలో ఎక్కువ శాతం మంది పేద ప్రజలకు కడు పునిండా అన్నం పెట్టాలన్న ఉద్దేశం తో సన్న బియ్యం ఇస్తున్నామని తె లిపారు.

నాగార్జునసాగర్ నియోజకవర్గం లో నే కొత్తగా 10800 రేషన్ కార్డు ఇస్తు న్నామని, 52,000 మందికి కొత్తగా లబ్ధిదారులను చేర్చడం జరిగిందని తెలిపారు. అర్హులైనవారందరికి రేష న్ కార్డులు ఇచ్చే వరకు ఇది కొనసా గుతుందని తెలిపారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు గత 3 సార్లు గరిష్ట స్థాయికి నీరు చేరడం అదృష్టం అని అన్నారు. వ్యవసాయ శాఖ, ఇరిగే షన్ శాఖ సమన్వయంతో గత యా సంగి ,వానకాలం కలిపి రెండు కోట్ల 81 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధా న్యాన్ని పండించడం జరిగిందని, భారత దేశంలో ఇప్పటివరకు ఇం త పంట పండలేదన్నారు. పంట పండించడమే కాకుండా ప్రతి గింజ కొంటున్నామని తెలిపారు. నాగార్జు నసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి భవిష్యత్తులో తనవంతు సహకా రం అందిస్తానని తెలిపారు.

 

రాష్ట్ర ఎస్సీ ,ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడు తూ ప్రపంచంలో నాగార్జున్ సాగర్ ప్రాజెక్టు గొప్పదనాన్ని మర్చిపోలేమ ని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏ ర్పడిన తర్వాత గత ప్రభుత్వం సం క్షేమ కార్యక్రమాలను అమలు చే యలేదని అన్నారు. నల్గొండ జిల్లా లో నాలుగు లక్షల 65398 రేషన్ కార్డులు ఉన్నాయని, కొత్తగా 621 55 ఇచ్చామని, నాగార్జునసాగర్ నియోజక వర్గంలో కొత్తగా 10747 కార్డులు ఇవ్వడం సంతోషమని, రే షన్ కార్డుల వల్ల అన్ని సంక్షేమ పథ కాలకు అర్హులు అవుతారని, అంతే గాక సన్నబియ్యం పొందుతారని తె లిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజ ల కోసం ఉచిత బస్సు, 200 యూ నిట్ల వరకు ఉచిత పవర్, అలాగే రై తు రుణమాఫీ, రైతుభరోసా వంటి అనేక కార్యక్రమాలను అమలు చే స్తున్నదని తెలిపారు.

నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి మాట్లాడు తూ గత ప్రభుత్వం పది సంవత్స రాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకో లేదని అన్నారు. రేషన్ కార్డుల పం పిణీ చారిత్రాత్మక నిర్ణయమని తెలి పారు. గడచిన 18 ఏళ్లలో మొదటి సారిగా జూలై నెలలో నాగార్జున సా గర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి అ న్ని గేట్లు తెరవడం చారిత్రాత్మకమ ని అన్నారు.

 

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మాట్లా డుతూ పెద్దవూర మండలంలోని 1200 కొత్త కార్డులు ఇవ్వడం అభి నందనీయమని అన్నారు.రేషన్ కా ర్డు స్కాలర్షిప్స్, పాఠశాలలు, ఆరో గ్య విషయాలకు లబ్ధి పొందేందుకు ప్రయోజనం చేకూరుస్తుందని, రేష న్ కార్డు నిరంతర ప్రక్రియ అని, చని పోయిన వారి పేర్లు తొలగించడం, కొ త్తవారిని ఎక్కించడంలో ప్రజలు సహకరించాలని, త్రిపురారం, పెద్ద వూర మండలాలలో ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తుల సమర్ప ణలో తప్పిపోయిన గ్రామాల్లో త్వ రలోనే సరి చేస్తామని, ధాన్యం కొ నుగోలులో పెద్దపురం మండల పిఎ సిఎస్ జిల్లాలోని మూడవ అతిపెద్ద కేంద్రంగా నిలిచిందని, సన్నబియ్యం లో సైతం పెద్దవూర రెండవ స్థానం లో ఉందని, రేషన్ కార్డు రాని వారికి వారంలో ఇచ్చేలా చర్యలు తీసు కుంటామని తెలిపారు.

 

ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ లింగా రెడ్డి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, తదిత రులు మాట్లాడారు.రాష్ట్ర పౌరసర ఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డిఎ స్ చౌ హన్, మార్కెట్ కమి టీ మాజీ చై ర్మన్లు సత్యం, చంద్రశేఖర్ రెడ్డి, మా జీ ఎంపీపీలు తదితరులు పాల్గొ న్నారు.