–ప్రస్తుతం లక్ష వరకున్న చెల్లింపులు రూ. 5లక్షలకు పెంపు
–వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంతదాస్
RBI:ప్రజా దీవెన, ముంబాయి: దేశం లో యూపీఐ వ్యవస్థలో (UPI system) కేంద్ర బ్యాంకు ఆర్బీఐ (RBI) కీలక మార్పులను చేసింది. యూపీఐ ద్వారా చేసే పన్ను చెల్లిం పుల పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ (Shaktikanta Das)ప్రకటించారు. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలను గురువారం ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా యూపీఐ కీలక మార్పు (UPI is a key change)అంశాన్ని ఆయన తెలిపా రు. దీంతో వ్యక్తిగత ఆదాయపు పన్ను, ఆస్తి పన్ను, ముందస్తు పన్ను చెల్లింపులు జరిపేవారు ఒక ట్రాన్సా క్షన్‌లో రూ.5 లక్షల వరకు చెల్లించే అవకాశం ఉంటుందన్నారు. యూపీఐ చెల్లింపుల పరిమితిని 2023 డిసెంబర్‌లో క్యాపిటల్ మార్కెట్లు, బీమా, రెమిటెన్స్‌ల
(Capital Markets, Insurance, Remittances). వైద్య ఖర్చులు, విద్యాసంస్థల్లో ఫీజులు ఐపీవోలలో పెట్టుబడి, రిటైల్ డైరెక్ట్ స్కీంలలో ఒక్క ట్రాన్సాక్షన్ (transaction) ను రెండు లక్షలకు పెంచింది.. తాజాగా ఆ మొత్తాన్ని అయిదు లక్షలు చేసింది.