RDO Ashok Reddy : ప్రజా దీవెన శాలిగౌరారం మార్చి 28 : ఆరబెట్టిన తరువాత ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుక వచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని నల్గొండ ఆర్ డి ఓ యానాల అశోక్ రెడ్డి కోరారు. శుక్రవారం శాలిగౌరారం లోని వ్యవసాయం మార్కెట్ యార్డ్ ను ఆర్ డి ఓ అశోక్ రెడ్డి సందర్శించారు. రైతులు వరి కోతల సమయం లో పలు జాగ్రత్తలు పాటించాలన్నారు.
వరి పంట కోతకు వచ్చిన తరువాత కోసి కోత మిషన్ ద్వారా తాలు, చెత్త రాకుండా జాగ్రత్త పడాలని, ధాన్యాన్ని అరబెట్టి ఎండిన తరువాత మార్కెట్ కు తీసుకరావాలన్నారు.ధాన్యం కొనుగోళ్ళ కేంద్రాలలో రైతులకు మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమం లో తహసీల్దార్ పి. యాదగిరి, సింగల్ విండో సీఈఓ నిమ్మల ఆంజనేయులు, మార్కెట్ సిబ్బంది రైతులు ఉన్నారు