RDO : ప్రజా దీవేన,కోదాడ : రైతులు పండించిన రబీ పంటకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలని రైతు సంఘం ఆధ్వర్యంలో ఆర్డీవో సూర్యనారాయణకు సోమవారం వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఇప్పటికే 10 శాతం పంట పొలాలను రైతులు కోసుకున్నారని ఇంకా పది రోజులలో 70% పంటలు కోతకు వస్తాయని వాటిని కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు రైతుల వద్ద నుండి దండుకుంటున్నారని అన్నారు. దళారులు రైతుల వద్ద నుండి వడ్లను ఎక్కువ కేజీలు వేసుకుంటున్నారని వాటిని నియంత్రించాలని అన్నారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ కనగాల నారాయణ, కిసాన్ మోర్చా అధ్యక్షులు వేలువోలు చిట్టిబాబు,రైతులు కనగాల శేషగిరి కనగాల పుల్లారావు,మల్లె బోయిన వెంకటేష్ బాబు,సామినేని రమేష్,వంకాయలపాటి లక్ష్మయ్య,సజ్జ వెంకటేశ్వరరావు,వంకాయలపాటి లక్ష్మయ్య,వై రామ్మూర్తి,జి నాగభూషణం,టీవీ గిరి,నవీన్ తదితరు రైతులు పాల్గొన్నారు.