–దేశానికి మోడల్‌గా తెలంగాణ డిజాస్టర్ మేనేజిమెంట్
–నదీపరివాహక ప్రాంత నిర్వాసితు లకు ఇందిరమ్మ ఇండ్లు
–రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్, సమా చార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Telangana State Disaster Management : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాలను సమర్ధవంతంగా ఎదుర్కొని వీలైనంత వరకు ప్రాణ నష్టం, ఆస్ధి నష్టం జరగకుండా ఉం డేలా తెలంగాణ డిజాస్టర్ మేనేజి మెంట్ అధారిటీ (తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్ధ)ని బలోపే తం చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధా ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. దేశానికి ఒక మోడ ల్‌గా ఉండేలా వ్యవస్ధను రూపొం దించాలని అధికారులను ఆదేశిం చారు. ఇందుకు సంబంధించి తెలం గాణ రాష్ట్ర విపత్తు నిర్వహణా సం స్ధ (TGSDMA) ను పునర్వ్యవస్ధీక రించినట్లు వెల్లడించారు. ఈ సంస్ధ కు ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా ఉంటా రని ఇందులో రెవెన్యూ, హోమ్, ఆర్ధిక, వైద్య ఆరోగ్యం, భారీ నీటిపా రుదల, రహదారులు భవనాలు, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల మంత్రులు సభ్యులుగానూ, చీఫ్ సెక్రటర్ మెంబర్ కన్వీనర్‌గా ను, రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్ర టరీ ప్రత్యేక ఆహ్వానితునిగా ఉంటా రని తెలిపారు.బుధవారం రాష్ట్ర సచివాలయంలో గోదావరి మరి యు కృష్ణా నదీ పరివాహక జిల్లా ల్లో వరద నిర్వహణపై ఆయా జిల్లా ల కలెక్టర్లు , ఇతర ఉన్నతాధికా రులతో చీఫ్ సెక్రటరీ కె. రామకృ ష్ణారావు, విపత్తుల నిర్వహణ ప్రత్యే క ప్రధాన కార్యదర్శి అరవింద్ కు మార్‌తో కలిసి సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే…
“వాతావరణ మార్పుల వల్ల ఆకస్మి కంగా వచ్చే వరదలు, వర్షాల సమా చారాన్ని ఐఎండీతో సమన్వయం చేసుకొని శాస్త్రీయంగా విశ్లేషించుకొ ని ఎప్పటికప్పుడు పై స్ధాయి నుం చి కింది స్ధాయి వరకు అందించేలా వ్యవస్ధను రూపొందించుకోవాలని సమాచార వ్యవస్ధ మరింత బలోపే తం కావాలి. రాష్ట్ర స్దాయిలో వర్షా లు, వరదలకు సంబంధం ఉన్న ఇరిగేషన్, విద్యుత్, హెల్త్, వ్యవసా యం, పోలీస్, రవాణా తదితర విభాగాలకు ప్రత్యేక నోడల్ అధికా రులను నియమిస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలను మనం అడ్డుకోలేం కానీ వాటి ప్రభావాన్ని తగ్గించడానికి ముందస్తుగా పటిష్టమైన చర్యలు తీసుకుంటే నష్టాన్ని వీలైనంతవరకు తగ్గించగలుగుతాం.
ప్రధానంగా కృష్ణా గోదావరి పరీ వా హక ప్రాంతాల అధికారయం త్రాం గం వరద ముంపును ముందుగా నే గుర్తించి ఎప్పటికప్పుడు అప్రమత్తం గా ఉండాలి. దీనివలన మనం నష్టా న్ని తగ్గించినవారమవుతాం. నదీప రివాహక ప్రాంతాల్లో ఏ మేరకు వర ద ఉధృతి వస్తే ఏఏ గ్రామాలు ముం పునకు గురౌతాయోనన్న సమాచా రాన్ని నీటిపారుదల శాఖ ముందు గానే అందించాలని, ఇతర రాష్ట్రాల లో వచ్చే వరద వివరాలు, స్ధానికం గా పడిన వర్షం వివరాలు, ఎంత నీ టిని విడుదల చేస్తారనే విషయా లు సవివరంగా ఉండాలి. నదీ పరి వాహక ప్రాంతాల్లోని నివాసితులను వరదలు వచ్చిన ప్రతిసారీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం కంటే వారికి శాశ్వత నివాసం కల్పించాలి.
ఇందుకు సంబంధించి నివాసితుల వివరాలను గుర్తిస్తే అదనపు కోటా కింద ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తాం.” భారీ వర్షాలు, వరదల స మయంలో వాగుల్లో వంకల్లో చెరు వుల్లో చిక్కుకు్న్నవారిని రక్షించడా నికి ఎయిర్ లిఫ్ట్ మెకానిజాన్ని సి ద్దం చేసుకోవాలి. ఈ ఎయిర్ లిఫ్ట్ వ్యవస్ద సరిగా లేకపోవడం వల్ల గత ఏడాది నా నియోజకవర్గం పాలేరు లో చిక్కుకున్న బాధితులను రక్షిం చుకోలేకపోయానని ఈ సంద ర్బం గా మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్ లిఫ్ట్ మెకానిజం ఏవిధంగా ఉండాలి, విపత్తు సంభవించిన ప్రాంతానికి ఏవిధంగా చేరుకోవాలి వంటి అంశాలపై అధ్యయనం చే యాలని అధికారులకు సూచిం చారు.
ఈ సమావేశంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ ప్రత్యేక ముఖ్య కార్యద ర్శి అరవింద్ కుమార్, సెక్రటరీ శివ శంకర్, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి, హైడ్రా కమీషనర్ రంగనాధ్, పంచాయితీరాజ్ కమీష నర్ సృజన, సిపి డిసిఎల్ డైరెక్టర్ ముష్రాఫ్ అలీ, వ్యవసాయ సహకా ర శాఖ డైరెక్టర్ బి. గోపి. ఐఎండీ అ ధికారిణి నాగరత్నం. సివిల్ సప్లయి స్ డైరెక్టర్ ముజముల్ ఖాన్ తదిత రులు పాల్గొన్నారు.