MEPMA Employees’ Issues : ప్రజా దీవెన నల్గొండ టౌన్ : మెప్మా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రోడ్లు భవనాల , సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మెప్మా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బక్కయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 256 మంది ఉద్యోగులకు ఐకెపి ఉద్యోగుల మాదిరిగా పే స్కేల్ అమలు చేసేందుకు జీవో 157ను 2023 ఆగస్టు లో విడుదల చేశారని తెలిపారు.
కానీ గత మూడు నెలలుగా గతంలో ఇచ్చిన విధంగానే పాత వేతనాలు చెల్లిస్తున్నారని తెలిపారు. వెంటనే పే స్కేలు ప్రకారం వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా జిల్లాలో 16 మంది మెప్మా ఉద్యోగులకు గాను 13 మందికే ఏ స్కేల్ వర్తింప చేశారని, మిగతా ముగ్గురికి కూడా పే స్కేల్ అమలు జరిగేలా చూడాలని కోరారు. వినతి పత్రం సమర్పించిన వారిలో ఎన్ సరిత, సి హెచ్ పద్మ, జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.