వారాహి యాత్ర రెండో విడతకు రెడీ
— నేటి నుంచి ఏలూరు లో ప్రారంభం
ప్రజా దీవెన/ఏలూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన వారాహి విజయ యాత్రకు మొదటి దశ లో విశేష స్పందన లభించిన విషయం అందరికీ తెలిసిందే. గోదావరి జిల్లాల్లో ప్రారంభించిన వారాహి విజయ యాత్రకు మంచి రెస్పాన్స్ రావడంతో రెండో విడత యాత్రను ఆదివారం మళ్ళీ ప్రారంభిస్తున్నారు. రెండో విడత వారాహి విజయ యాత్ర ఈ రోజు ఏలూరు జిల్లా (నగరం) నుంచి ప్రారంభిస్తున్నట్లుగా జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది.
ఇవాళ సాయంత్రం ఏలూరులో బహిరంగసభ ఉంటుందని జనసేన పార్టీ తెలిపింది.పవన్ కల్యాణ్ రెండో విడత వారాహి విజయ యాత్ర ఏలూరుతోపాటూ… పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగనుంది. ఏలూరులో సాయంత్రం 5 గంటలకు పవన్ కల్యాణ్ బహిరంగసభతో యాత్రను మొదలుపెడతారు.రెండో విడత వారాహి విజయ యాత్రలో పవన్ కల్యాణ్… ఏలూరులో మొదలుపెట్టి దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.
ఈ యాత్రపై జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.హలో ఏపీ.. బైబై వైసీపీ నినాదంతో… పవన్ కళ్యాణ్.. వారాహి విజయ యాత్రను కొనసాగిస్తున్నారు. తన ప్రసంగాల్లో ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో.. అప్పుడప్పుడూ చెబుతూ… ప్రస్తుత ప్రభుత్వంపై చాలా ఆరోపణలు చేస్తున్నారు.
జనం బాగుండాలంటే జగన్ పోవాలి అనే స్లోగన్ ఇస్తున్నారు. వారాహి విజయ యాత్ర ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. జూన్ 14న అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ప్రారంభించిన మొదటి విడత వారాహి యాత్రను జూన్ 30న ముగించారు. తొలి దశ పర్యటనలో సుమారు 10 నియోజకవర్గాలను కవర్ చేశారు పవన్ కళ్యాణ్. దీనికి మంచి రెస్పాన్స్ రావడంతో… రెండో విడతను కూడా విజయవంతంగా పూర్తి చేసేందుకు పార్టీ వర్గాలు రెడీ అయ్యాయి.