–పెట్టుబడులకు దక్షిణ కొరియా సుముఖత
–బిజినెస్ రౌండ్‌టేబుల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పిలుపునకు టెక్స్‌టైల్ ఫెడరేషన్ సానుకూలత
Revanth Reddy: ప్రజా దీవెన, కొరియా: వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో (Mega Textile Park) పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పిలుపుతో ఈమేరకు కొరియా టెక్స్ టైల్ ఫెడరేషన్ సానుకూలంగా స్పం దించింది. దక్షిణ కొరియా పర్యటన లో భాగంగా తెలంగాణ ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పలు గ్లోబల్ కంపెనీ ల అధినేతలు, బిజినెస్ గ్రూపులతో సమావేశాలు, చర్చలు జరుపుతు న్నారు. ఈక్రమంలోనే కొరియా ఫెడ రేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జరిగిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ప్ర సంగించారు. టెక్స్‌టైల్ రంగం విస్తృ త్తికి తెలంగాణ ప్రభుత్వం తీసుకు న్న కార్యాచరణ స్థానిక కంపెనీలతో పాటు ప్రపంచ స్థాయి కంపెనీలకు కూడా అనుకూలంగా ఉందని సీఎం తెలిపారు. వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులకు సంబం ధించిన అవకాశాలను ముఖ్య మం త్రి వివరించారు. సియేల్ లో సీఎం … అమెరికా పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) బృందం పెట్టుబడుల ను ఆకర్షించేందుకు దక్షిణ కొరియా లోని సియోల్ చేరుకుంటుంది.
వివి ధ సంస్థల ప్రతినిధులతో సమావేశ మై పెట్టుబడులను తీసుకొచ్చే పని లో పడ్డారు. ఇందులో భాగంగా సోమవారం ఎల్‌ఎస్ (ఎల్‌జీ) గ్రూప్ అధినేతతో భేటీ అయ్యారు. రాష్ట్రం లో విద్యుత్ కేబుల్, గ్యాస్, ఇంధన, బ్యాటరీ ఉత్పత్తి (Electric cable, gas, fuel, battery production)పెట్టుబడులపై చర్చలు జరిపారు. త్వరలో తెలగా ణలో పర్యటించేందుకు ఎల్‌ఎస్ గ్రూప్ బృందం అంగీకరించింది. కొరి యా జౌళి పరిశ్రమ సమాఖ్య ఆధ్వ ర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ కాన్ఫెరెన్స్‌లో సీఎం రేవంత్ బృందం పాల్గొంది. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి ప్రసంగించారు. ఈ సమావే శంలో కొరియాకు చెందిన సుమారు 25 భారీ జౌళి పరిశ్రమల ప్రతినిధు లు పాల్గొన్నారు. వరంగల్‌లో ప్రతిష్ఠా త్మకంగా చేపడుతున్న మెగా టెక్స్‌టైల్ పార్కులో దక్షిణ కొరియా సంస్థలు పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.
పెట్టుబడులు పెట్టిన సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. మరోవైపు ఎని మిది రోజుల పాటు అమెరి కాలో సీఎం జరిపిన పర్యటన విజయ వంతమైందని తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటకనలో వెల్లడించింది. సీఎం రేవంత్ (CM Revanth) నిర్వహించిన సమీక్ష సమావేశాల ఫలితంగా 19కంపెనీల ప్రతినిధులు తెలంగాణలో రూ.31, 532 కోట్లు పెట్టుబడులు పెట్టేందు కు ముందుకు వచ్చినట్లు తెలిపింది.
రాష్ట్ర ప్రతినిధి బృందం అమెరికాలో దాదాపు 50కి పైగా వాణిజ్య సంస్థ లతో సమావేశమైందని, ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, విద్యుత్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ, ఎలక్ట్రానిక్ (Artificial Intelligence, Pharma, Life Sciences, Electric Vehicles, Data Centers, IT, Electronics) రంగాల్లో పెట్టుబడులు పెట్టే దిశగా పలు సం స్థలు సుముఖత వ్యక్తం చేసినట్లు వెల్లడించింది.యంగాన్ కార్పొరేషన్ చైర్మన్ కి యాక్ సంగ్, కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటి వ్ వైస్ చైర్మన్ సొయంగ్ జూ సహా 25 అగ్రశ్రేణి టెక్స్‌టైల్ కంపెనీల అధి నేతలు ఈ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొ న్నారు. ముఖ్య మంత్రి వెంట పరి శ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్న తాధికారులు కూడా సమావేశంలో ఉన్నారు.