Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy cheep coments రేవంత్ కు రైతులంటే చులకన

నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

రేవంత్ కు రైతులంటే చులకన

నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

 

 

ప్రజా దీవెన/నల్లగొండ: తెలంగాణ రైతులకు కెసిఆర్ ప్రభుత్వం అందిస్తున్న ప్రతిష్టాత్మక పథకం 24 గంటల ఉచిత విద్యుత్ పై పి సి సి అధ్యకుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం నల్లగొండ లో బి అర్ ఎస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ గడియారం సెంటర్ లో పెద్ద ఎత్తున రైతులు తమ నిరసన కార్యక్రమం చేపట్టి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రైతులపై కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిoచారు. గతం కాంగ్రెస్ హయాంలో రైతులు ఎన్ని రకాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారో రైతులు మర్చిపోలేదని, కాంగ్రెస్ పాలనలో తీవ్రమైన కరెంటు కోతలతో ప్రత్యక్ష నరకాన్ని రైతులు అనుభవించారని గుర్తు చేశారు. అదే పరిస్థితి మళ్ళీ తీసుకురావడం కోసమే రైతులకు మూడు గంటల విద్యుత్ సరిపోతుందని రేవంత్ అనడం రైతు లోకాన్ని వంచించడమేనని అవుతుందని విమర్శించారు.

రైతుల పట్ల వారి నిజస్వరూపం బయటపడిందని మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలు అవలంబించిందని దుయ్యబట్టారు. రైతుల పట్ల వారి విధానానికి ఈ వ్యాఖ్యలు దర్పణం పడుతున్నాయని అన్నారు.బిజెపి పార్టీ ఉచిత విద్యుత్ వద్దంటుంది బావులకు,మీటర్లు బిగించమంటుంది, తెలంగాణ ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు .

దేశం లో రెండు జాతీయ పార్టీలు కూడా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని, రైతులంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. రెండు జాతీయ పార్టీల అసంబద్ధ చర్యల మూలంగానే దేశ ప్రజలు కెసిఆర్ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.ఇక నల్లగొండ మాజీ ఎమ్మెల్యే, భువనగిరి ఎంపీ రోజుకో కొత్త పోకడలతో వింత వాదనలతో మతి స్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కి పోయే పరిస్థితిలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దపురించయనీ, ప్రజలు వెంకటరెడ్డి చేతలు చూసి నవ్వుకుంటున్నారన్నారనీ చెప్పారు.

ఈ నిరసన కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్ , మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కనగల్ ఎంపీపీ కరీం పాషా, జెడ్పిలో ఫ్లోర్ లీడర్ తిప్పర్తి జడ్పిటిసి పాశం రామ్ రెడ్డి, జేఏసీ నాయకులు జి వెంకటేశ్వర్లు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు సుంకరి మల్లేష్ గౌడ్ కటికం సత్తయ్య గౌడ్, బక్క పిచ్చయ్య, ఫరీదోద్దీన్, మాలే శరణ్య రెడ్డి, లొడంగి గోవర్ధన్, జమాల్ ఖాద్రి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, తిప్పర్తి, కనగల్, నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, అయితగొని యాదయ్య గౌడ్ ,దేప వెంకటరెడ్డి, పలువురు కౌన్సిలర్లు ఎంపీటీసీలు సర్పంచులు మహిళా నాయకులు పాల్గొన్నారు.