Praja Deveena
Newspaper Banner
Date of Publish : 10 January 2026, 3:32 pm Posted by : praja deveena

Minister Ponguleti Srinivasa Reddy : జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

–హైదరాబాద్ ప్రెస్ క్లబ్ జర్నల్ ను ఆవిష్కరణలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Minister Ponguleti Srinivasa Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: జర్నలి స్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉం దని రాష్ట్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అ న్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నూ తన కమిటీ రూపొందించిన ప్రెస్ క్ల బ్ జర్నల్ ను మంత్రి సచివాల యం లో శనివారం ఆవిష్కరించారు.

తెలుగు ఇంగ్లీష్ భాషల్లో ప్రతినెల ప్రె స్ క్లబ్ జర్నలను రూపొందించడం అభినందనీయమని పొంగులేటి సందర్భంగా ప్రశంసించారు. ఈజ ర్నల్లో జర్నలిస్టులకు సంబంధించి న సమకాలిన అంశాలు పొందుపర చడం సంతోషకరమని పొంగులేటి చెప్పారు. ప్రెస్ క్లబ్ నూతన పాలక మండలి ఏర్పడి మూడు నెలలు అ యినప్పటికీ జర్నలిస్టుల సంక్షేమ అభివృద్ధికి వివిధ కార్యక్రమాలను రూపొందించామని ప్రెస్ క్లబ్ అధ్య క్షులు ఎస్ విజయకుమార్ రెడ్డి ప్ర ధాన కార్యదర్శి రమేష్ వరికుప్పల మంత్రికి వివరించారు.

ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఇన్సూరె న్స్ సౌకర్యం కల్పిస్తున్నామని ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంద ని మంత్రికి వివరించారు. జర్నలి స్టు ల కోసం ప్రెస్ క్లబ్ చేపట్టే కార్యక్రమా లకు ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

ప్రెస్ క్లబ్ జర్నల్ ఆవిష్కరణ కార్య క్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు ఏ. రాజేష్, అరుణ అత్తలూరి, జాయిం ట్ సెక్రెటరీ చిలుకూరి హరిప్రసాద్, కోశాధికారి రమేష్ వైట్ల, ప్రెస్ క్లబ్ కా ర్యవర్గ సభ్యులు శంకర్ శీగ, ఎన్ . ఉమాదేవి, రచన ముడుంబై, వనం నాగరాజు, అమిత్ బట్టు తదితరు లు పాల్గొన్నారు.