Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy: మహబూబ్ నగర్ కు మహర్దశ

–ఆయా అభివృద్ధి ప‌నులు సీఎం రేవంత్​ శంకుస్థాపన
–సీఎం హోదాలో తొలిసారి పాల మూరు రాక
–రూ. 396.09 కోట్ల‌తో చేప‌ట్ట‌నున్న అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న

Revanth Reddy:ప్రజా దీవెన, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్: తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సీఎం హోదాలో తొలిసారి మ‌హ‌ బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో మంగ‌ళ‌వారం ప‌ర్య‌టించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రూ. 396.09 కోట్ల‌తో చేప‌ట్ట‌నున్న అభివృద్ధి ప‌నుల‌కు (Development works) శంకుస్థాప‌న చేశారు. పాలమూరు యూనివర్సిటీలో రూ. 42.40 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు, అలాగే రూ.13.44 కోట్లతో ఎస్టీపీ భ‌వ‌నానికి, అకాడామిక్ బ్లాక్, గ్యాలరీ పనులకు, ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (For STP Building, Academic Block, Gallery Works, MVS Govt Degree College) రూ.10కోట్లతో బాలికల హాస్టల్ భ‌వ‌న‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇదిలా వుండగా దేవరకద్రలో రూ.6. 1కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల (MVS Govt Degree College) భ‌వ‌న‌ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మహబూబ్ నగర్ రూరల్ లో రూ.3.25 కోట్లతో చేప‌ట్ట‌నున్న‌ కేజీవీబీ భవన నిర్మాణానికి, గండీడ్ లో రూ.6.2 కోట్లతో కేజీవీబీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో రూ.37.87 కోట్లతో సీసీ రోడ్లు, స్టోరేజ్ ట్యాంక్ పనులకు, రూ.276.80 కోట్లతో ఎస్టీపీ భ‌వ‌న‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో యూనివర్సిటీ (university) విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.

పాలమూరులో వ‌న మ‌హోత్సం (Vana Mahotsam)… అంత‌కు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొ ని మహబూబ్ నగర్‌ కలెక్టరేట్ ఆల యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) తది తరులు పాల్గొన్నారు.అనంతరం, జిల్లా అభివృద్ధిపై కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యంపై సమీక్షించను న్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, చిన్నారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉమ్మడి జిల్లాకు చెందిన ఐదుగురు కలెక్టర్లు, ఇతర అధికారులు సీఎం సమీక్షలో పాల్గొన్నారు.