Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy : మహిళలకు మరింత ప్రోత్సాహం

–పాడి పశువులు, కోళ్ల ఫారాలు, మిల్కాపార్లర్లు, సంచార చేపల విక్రయ కేంద్రాలు
–మహిళాశక్తి పథకం కింద మంజూ రుకు ప్రభుత్వ నిర్ణయం

Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని (Telangana State) స్వయం సహాయక సంఘాలకు మరింత ప్రోత్సాహం కల్పించేందుకు రేవంత్ రెడ్డి (Revanth Reddy )ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళాశక్తి పథకం కింద పాడి పశు వులు, దేశవాళీ కోళ్ల పెంపకం, పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు, సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఆయా యూనిట్ల నిర్వహణకు బ్యాంకులు, స్త్రీనిధి, మండల మహిళాసమాఖ్య ద్వారా రుణ సాయం అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల్లో అర్హులైన వారిని వీటి కోసం ఎంపిక చేయాలని తాజాగా జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.

పాడి పశువులకు (Dairy cattle) సంబంధించి ప్రతి జిల్లాకు రూ.4.50 కోట్లతో 500 మంది మహిళా సమా ఖ్యల సభ్యురాళ్లకు పాడిపశువుల యూనిట్లు ఇస్తారు. రూ.90 వేల రుణ సాయంతో ఒక్కో సభ్యురాలికి ఒకటి లేదా రెండు పాడిపశువులను కొనుగోలు చేసి ఇస్తారు. గ్రామ పరిధి లోని మహిళా సమైక్య సంఘంలో (Women’s Union) వారు సభ్యురాళ్లై ఉండాలి. పశువుల పెంపకానికి, జీవనానికి అనువైన వాతావరణం ఉన్న గ్రామాల్లోని వారికే వీటిని మంజూరు చేస్తారు. ఇక నాటుకోళ్ల పెంపకం కు సంబంధించి ఒక్కో జిల్లాలో రూ.3 కోట్లతో రెండు వేల మందికి వీటిని మంజూరు చేస్తారు.

మహిళా సంఘంలోని (Women’s Union) సభ్యురాళ్లకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున రుణసాయం చేస్తారు. దీనికింద 20 లేదా 50 లేదా 100 దేశవాళీ కోళ్లను ఇంటి వద్దే పెంచుకోవచ్చు. కాగా కోళ్ల ఫారాలకు (poultry farms) సంబంధించి ప్రతి జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున మంజూరు చేస్తారు. యూనిట్కు రూ.2.91 లక్షల రుణం ఇస్తారు. సొంత స్థలం ఉండి షెడ్డు వేసుకొని పారం ఏర్పాటు చేసుకు నేందుకు ముందుకొచ్చే వారిని ఎంపిక చేస్తారు. వారికి నిర్వహణపై శిక్షణ ఇచ్చిన అనంతరం రుణం మంజూరు చేస్తారు.పాల విక్రయ కేంద్రాలకు సంబంధించి మండ లానికి ఒకటి చొప్పున మహిళా సంఘాలకు వీటిని మంజూరు చేస్తారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సినిమాథియేటర్లు, రైతు బజార్లు ఉండే ప్రాంతాల్లోని సంఘాల సభ్యు రాళ్లకు అవకాశం కల్పిస్తారు. ఒక్కో పార్లర్ ఏర్పాటుకు రూ.1.90 లక్షల రుణం అందిస్తారు. ఇకసంచార చేపల విక్రయ కేంద్రాలకు సంబం ధించి ఒక్కో యూనిటుకు రూ.10 లక్షల చొప్పున మండలానికి ఒకటి ఇస్తారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి (Prime Minister of the Central Government) మత్య్స సంపత్ యోజన కింద 60 శాతం సబ్సిడీ లభిస్తుంది. వాహనం కొనుగోలుతో పాటు చేపల నిల్వ, విక్రయాలు, శుద్ధి, వంట ఉత్పత్తుల తయారీ పరికరాలు, పాత్రలను సమకూర్చుకోవాల్సి ఉంటుంది.