–లోక్ సభ ఎన్నికల్లో పోటీకి సరైనో ళ్ళు సరితూగకపోవడమే కారణం
–కొన్నిచోట్ల మా అభ్యర్థుల స్థాయి సరిపోలేదు, కాంగ్రెస్ దిగ్గజాలంతా అసెంబ్లీకి గెలిచిరావడం
–ఓడిన వారే మళ్లీ పోటీ చేయడం బీజేపీకి కలిసొచ్చిన వైనం
–నా మార్కు మూసీ ప్రాజెక్టు మొద లెట్టిన మూడేళ్లలో పూర్తి చేస్తాం
–ఫోన్ ట్యాపింగ్ చేయించినోళ్లు అనుభవించడం అనివార్యం
–ఏపీతో పంపకాల్లో చట్టప్రకారమే వ్యవహరిస్తాo
–ఢిల్లీ వేదికగా మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో ( Lok Sabha elections)తెలంగాణ రాష్ట్రంలో ఆశించిన ఫలితాలు రావటం లేక పోయామని ముఖ్యమంత్రి ఎను ముల రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థులకు సరైన అభ్యర్థులు లేకపోవడం వల్లే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు (conggress) కొన్ని చోట్ల ప్రతికూల ఫలితాలు వచ్చా యని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు లోక్‌సభ ఎన్నికలలో శాయశక్తులా పోరాడా యని, తనతో పాటు ఉత్తమ్, కోమ టిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, వివేక్, దామోదర రాజనర్సింహ లాంటి కాంగ్రెస్ దిగ్గజ నేతలంతా శాసనసభకు ఎన్నిక కావడంతో లోక్‌సభ ఎన్నికలలో పలుచోట్ల బీజేపీ అభ్యర్థులకు సరితూగే నేతలు లేకపోయారని గుర్తు చేశారు. బీజేపీ (bjp) తరపున పోటీ చేసి న ధర్మపురి అర్వింద్, బండి సంజ య్, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌లు అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయి, తిరిగి లోక్ సభకు పోటీ చేయడం వల్ల వారి పర్సనాలిటీలతో పోటీపడే విష యంలో అక్కడి తమ అభ్యర్థులు కాస్త వెనుకబడ్డారన్నారు. ఢిల్లీ పర్య టనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుగ్లక్ రోడ్డులోని తన అధికార నివాసంలో విలేకరులతో ఇష్టాగోష్ఠి గా మాట్లాడారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన టెలి ఫోన్ ట్యాపింగ్ (Telephone tapping)వ్యవహారం న్యాయ స్థానం పరిధిలో ఉందని, ఆ విషయంలో తాను జోక్యం చేసుకోవ ట్లేదు కాని చేయించినోళ్ళు అనుభ వించడం అనివార్యమని స్పష్టం చేశారు. ఒక మహిళా ఐఏఎస్ అధి కారిఫోన్‌ను కూడా ట్యాపింగ్ చేసిన ట్లు వార్తలు వచ్చాయని ప్రస్తావిం చారు. కత్తి పట్టినోడు కత్తికి బలైతా డు అన్నట్లు ఫోన్ ట్యా పింగ్‌కు పాల్పడినోళ్లు దానికి బలి కావడం ఖాయమని చెప్పారు. మంత్రివర్గ విస్తరణ గురించి విలేకరులు ప్రశ్నిం చగా అంతా మీడియాయే మాట్లా డుతోందని వ్యాఖ్యానించారు.
ఈవీఎం (evm) అక్రమాలపై అనుమా నాలు ఉన్నాయి …ఈవీఎంలతో ఎన్నికల సమయంలో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని ముఖ్య మంత్రి రేవంత్ (Revanth Reddy) అభిప్రాయపడ్డారు. పోలింగ్ కేంద్రాలకు అవసరమైన ఈవీఎంలకు అదనంగా మరో 15 శాతం ఈవీఎంలు ప్రతీ నియోజక వర్గానికి కేటాయించి, ఈవీఎంల పంపిణీ కేంద్రానికి తరలిస్తారని చెప్పారు. ఈవీఎంలను పోలింగ్ బూత్‌లకు తరలించేటప్పుడు ఆ 15 శాతం అదనపు ఈవీఎంలు పంపిణీ కేంద్రంలోనే ఉండి పోతా యన్నారు. పోలింగ్ పూర్తయ్యాక అన్ని ఈవీఎంలు తిరిగి పంపిణీ కేంద్రానికే వస్తాయన్నారు. ఇలా పోలింగ్‌లో వాడిన ఈవీఎంలను, వాడని ఈవీఎంలను ఒకచోట చేర్చి నపుడు అక్రమాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని సీఎం అభి ప్రాయపడ్డారు. యూపీఏ ప్రభుత్వం రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయక త్వంలో ఈవీఎంల (evm) అక్రమాలపై పో రాటం చేశామని రేవంత్ గుర్తు చేసు కున్నారు. ఫలితంగానే వీవీప్యాట్ల ద్వారా 5 శాతం ఓట్లు లెక్కించాలనే నిబంధనలు వచ్చాయని గుర్తు చేశారు. ఈవీఎంలు అన్నింటినీ దుర్వినియోగం చేసే అవకాశాలు లేవని, పది వేల ఓట్ల తేడాతో ఓడి పోతామని అంచనా ఉన్న స్థానాల లో మాత్రమే ఫలితాలను తారుమా రు చేసే అవకాశాలున్నాయని రేవం త్‌రెడ్డి చెప్పారు.
రాష్ట్రంలో నా మార్కు మూసీ నే ..మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టు తన పాలనలో చరిత్రాత్మకంగా నిలి చిపోతుందని రేవంత్ (Revanth Reddy) ప్రకటించారు. హైదరాబాద్‌లో 55 కిలోమీటర్ల మేరకు మూసీ నదిని, దాని పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా తన ముద్ర వేస్తానని చెప్పా రు. మూసీతో పాటు ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టును తమ ప్రభుత్వం ప్రతి ష్ఠాత్మకంగా తీసుకుందని చెప్పారు. హైకోర్టు నిర్మాణాన్ని అనుకున్న వి ధంగా పూర్తి చేస్తామని ప్రకటించారు. మూసీ నదిలోకి (Musi River) గండిపేట ద్వా రా గోదావరి నీటిని తరలిస్తామని, త్వరలో టెండర్లు పిలుస్తామని చెప్పారు. గండిపేట నుంచి రింగ్ రోడ్డు వరకు 55 కిలోమీటర్ల మేర మూసీ అభివృద్ధి ప్రాజెక్టుకు సంబం ధించి ఖర్చును అంచనా వేసే బాధ్య తను రెండు అంతర్జాతీయ సంస్థల కు అప్పగించామని చెప్పారు. ప్రాజె క్టు పొడవునా రోడ్డు, మెట్రోలు ఉం టాయని తెలిపారు.
నగరంలోని మురికి నీటిని ఎస్టీపీల్లో శుద్ధి చేసిన తర్వాతే మూసీలోకి వదులుతా మని చెప్పారు. నిర్మాణం ప్రారంభిం చిన మూడు ఏళ్లలో ప్రాజెక్టును పూ ర్తి చేస్తామని ప్రకటించారు. ప్రాజెక్టు ను 12–15 కిలోమీటర్ల పొడవు ఉండే 4 క్లస్టర్లుగా విభజించి, నాలు గు పెద్ద ఏజెన్సీలకు బాధ్యత అప్ప గిస్తామన్నారు. ప్రాజెక్టులో భాగంగా 10,500 అక్రమ నిర్మాణాలను కూ ల్చివేయాల్సి వస్తుందని అంచనా వేశారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయించడం, ల్యాండ్ పూలింగ్ (Land pooling) చేపట్టి ఇళ్ల స్థలాలు ఇవ్వడం, టీడీ ఆర్ ఇవ్వడం, నష్టపరిహారం ఇలా నాలుగు పద్ధతుల్లో పునరావాసం ఉంటుందని చెప్పారు. ఆగస్టులో జపాన్, కొరియాలలో నదుల అభి వృద్ధిని పరిశీలిస్తామని వెల్లడించా రు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేల (mlas) ఫిరాయింపు వ్యవహారానికి సంబంధించి గతంలో తాను టీడీపీలో ఉండగా న్యాయస్థానాలలో కొట్లాడానని రేవంత్ గుర్తు చేసుకున్నారు. 12 వారాలలో స్పీకర్ నిర్ణయం తీసుకో వాలని కోర్టు ఇచ్చిన తీర్పు తన పోరాట ఫలితమేనన్నారు. పెగాసెస్ ద్వారా ఫోన్ల ట్యాపింగ్ జరుగుతు న్న వ్యవహారాన్ని వ్యవహారాన్ని దేశం లోనే మొదట వెలుగులోకి తెచ్చింది తానేనని రేవంత్ గుర్తు చేసుకున్నారు. ఎంపీగా ఉన్న సమ యంలో లోక్‌సభలో పెగాసెస్ అం శంపై మొదట తానే ప్రశ్నించానని గుర్తు చేశారు. అదే విధంగా గ్రూప్ 1 మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం 1:5 0 నిష్పత్తిలో చేపట్టాలని నోటిఫికేష న్ ఇచ్చిందని, దాన్నే తాము అమ లు చేస్తున్నామని రేవంత్ తెలిపా రు. ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేసే విషయంలో తమ ప్రభుత్వం సీరి యస్‌గా ఉందని గ్రహించిన ప్రతి పక్షాలు ఇప్పుడు అడ్డుపుల్లలు వేసేందుకు తమ వంతు ప్రయ త్నాలు ప్రారంభించాయని ఆరో పించారు. తాను పలుమార్లు ఢిల్లీ వచ్చిన విషయాన్ని ప్రచారం చేస్తు న్న విపక్షాలు రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చిన ప్రతిసారీ కేంద్రమంత్రులను కలుస్తున్న విషయాన్ని మాత్రం చె ప్పట్లేదని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లు ఉండడం గ్యారెంటీ అని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పునరుద్ఘాటించారు.