–మరియమ్మ లాకప్ డెత్ ఘటన లో పదిరోజుల్లో కేసీఆర్ న్యాయం చేశారు
–కర్లరాజేష్ విషయంలో 95 రోజు లైనా రేవంత్ న్యాయం చేయలేదు
— నిందితున్ని కాపాడుతోన్న ఉత్త మ్ ని మంత్రిగా బర్తరఫ్ చేయాలి
–తెలంగాణ 2 రాజ్యసభ సీట్లలో సీఎం మాదిగలకు ఒకటివ్వాలి
–ఎంఆర్ పిఎస్ వ్యవస్థాపక అధ్య క్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
Karla Rajesh Incident : ప్రజా దీవెన, హైదరాబాద్:కర్ల రాజే ష్ లాకప్ డెత్ విషయంలో రేవంత్ రెడ్డి మౌనం విడనాడాలని ఇల్లీగల్ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి రాజేష్ మృతి కి కారణమైన చిలు కూరి ఎస్సై సురేష్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మం దకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. అదేవిధంగా రాజేష్ కుటుంబానికి కొటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రక టించి ఇంటిలో ఒకరికి ఉద్యోగం ఇ వ్వాలని డిమాండ్ చేశారు.
శనివారం ఉస్మానియా యూనివ ర్సిటీలో ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జరి గిన విలేకరుల సమావేశంలో మం దకృష్ణ మాదిగ మాట్లాడారు. మరి యమ్మ లాకప్ డెత్ విషయంలో కేసీఆర్ 10 రోజుల్లోనే తగు న్యా యం చేశారని, మరియమ్మ కుటుం బానికి 35 లక్షలు ఇచ్చారని, ఎస్సై ని సస్పెండ్ చేసి ఆ ఇంటిలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి కేసీఆర్ న్యాయం చేశారని గుర్తు చేశారు. కానీ రాజే ష్ విషయంలో లాకప్ డెత్ జరిగి 9 5 రోజులవుతున్న రేవంత్ రెడ్డి ఇం తవరకు స్పందించలేదన్నారు.
SC కమిషన్ లాకప్ డెత్ కు కార కులైన ఎస్ఐని సస్పెండ్ చేయా లని, రీపోస్టుమార్టం నిర్వహించా లని డిజిపి మరియు చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చి రెండు నెలలు అ యిన ఇప్పటివరకు ఎస్ఐని స స్పెండ్ చేయలేదని,రీ పోస్టుమార్టం నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డిని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కా పాడుతున్నాడని అందుకోసం పో లీసు ఉన్నత అధికారులకు ఆదేశా లిస్తూ సూర్యాపేట ఎస్పి మీద ఒ త్తిడి చేశారని, SC కమిషన్ మెం బ ర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డితో చను వుగా ఉండే ఎమ్మెల్యేలతో మాట్లా డించి ఎస్ఐ ని కాపాడటానికి అడి గినట్లు ఆధారాలతో నిరూపిస్తామ న్నారు.
మరియమ్మ కేసులో ఒక బీసీ బిడ్డ అయిన ఎస్ఐని సస్పెండ్ చేయిం చడం కోసం అనాడు స్పందించి రో డ్ ఎక్కిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నే డు నిందితుడైన ఎస్సైని తన రెడ్డి సామాజిక వర్గం కాబట్టే కాపాడు తున్నాడని ఆరోపించారు. బాధి తుల పక్షాన ఉండకుండా నిందితు ల పక్షాన ఉన్నాడని దుయ్యబట్టా రు. SC కమిషన్ సస్పెండ్ చేయా లన్న నిందితున్ని కాపాడడం కూ డా నేరమే అవుతుందన్నారు కాబ ట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రి వర్గం నుండి తక్షణమే భర్తరఫ్ చే యాలని డిమాండ్ చేశారు.
ఈ మార్చి మొదటి వారంతో తె లంగాణ రాష్ట్రంలో కాలి అవబో తున్న రెండు రాజ్యసభ సీట్లలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఒకటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తె లంగాణ లో మూడు ఎస్సీ రిజ ర్వుడు లోకసభ స్థానాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఒకటి కూడా మాదిగ లకు కేటాయించలేదు. మాకు లో కసభలో ప్రాతినిధ్యం లేకుండా పో యింది. తెలంగాణ రాష్ట్రంలో అ త్యధిక జనాభా గల సింగిల్ కాస్ట్ మాదిగల అయితే ఆ మాదిగలకు ఒక సీటు కూడా ఇవ్వకుండా కాంగ్రె స్ పార్టీ ద్రోహం చేసింది.ప్రస్తుతం రాజ్యసభలోనైనా మాదిగలకు సీ టు కేటాయించాలని లేకపోతే మా దిగల ఆవేదనకు గురికాకు తప్ప దని అన్నారు.
ఇప్పటికే లోక్ సభలో ఏడుగురు రె డ్లు ఉన్నా కూడా రేపు రాజ్యసభకు కూడా పోటీపడతారు ఖాళీ అయ్యే రెండిట్లో ఒకటి మాదిగలకు ఇచ్చి రెండోది ఎవరికి ఇచ్చుకున్న మాకు అభ్యంతరం లేదని అన్నారు.అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అవ బోతున్న నాలుగు రాజ్యసభ సీట్ల లో ఒకటి మాదిగలకు చంద్రబాబు నాయుడు కేటాయించాలని అందు లో వర్లరామయ్యకి కేటాయించాల న్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోవిం దు నరేష్ మాదిగ, ఎమ్ ఎస్ ఎఫ్ జాతియ అధ్యక్షులు డాక్టర్ చిప్పల పల్లి సోమశేఖర్ మాదిగ, తెలంగా ణ రాష్ట్ర అధ్యక్షులు సందే కార్తీక్ మాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కొమ్ము శేఖర్ మాదిగ, వేము ల ఎల్లయ్య మాదిగ, ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షులు మంద రాజు మాదిగ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు జనపాల మహేష్ మా దిగ, ముప్పూరి పురుషోత్తం మా దిగ, దావు ఆదిత్య మాదిగ ఈ దు ల రాజీవ్ ప్రదీప్ మాదిగ, ఉస్మాని యా యూని వర్సిటీ ఎంఎ స్ ఎఫ్ నాయకులు ఎమ్మార్పీఎస్ నాయ కులు పాల్గొన్నారు.