Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy: విస్తరణకు ‘ఆషాడం ‘ముహూర్తం

–అషాడ మాసంకు ముందే ముగించేందుకు ప్రయత్నం
–గవర్నర్‌తో సీఎం రేవంత్‌ సమా వేశం నేపద్యంలో ప్రచారం
–అన్నీ సర్దుకుంటే రెండు మూడు రోజుల్లోనే అమాత్యులపై నిర్ణయం
–ఈ దఫా డిల్లీ పర్యటనలో కొలిక్కి రానున్న తుది జాబితా వ్యవహారం

Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) మంత్రివర్గం కూర్పు తుదిదశకు చేరుకోబోతుంది. కాంగ్రెస్ పార్టీ (Congress party) రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత 11 మందితో పాటు తా ను ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. మంత్రివర్గంలో మిగిలిన ఆరుగురి నియామకానికి సంబంధించి చాలాకాలంగా రకర కాల విస్తృత ప్రచారాలు జరుగు తున్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధిష్టానం ఆమోదంతో అందరికీ ఆమోదయోగ్యమైన వారిని మంత్రి వర్గoలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు (Party factions)వెల్లడిస్తు న్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ ను కలిసిన క్రమంలో మరోమారు మంత్రివర్గ విస్తరణ తెర మీదకు వచ్చింది. దీంతో రాష్ట్ర మం త్రివర్గ విస్తరణ వ్యవహారం కొలిక్కి వచ్చినట్లు తెలియవస్తుంది. ప్రధా నంగా ఈ నెల 5 నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కానున్న నేప థ్యంలో కేబినెట్‌లో కొత్తగా ఎవ రెవరికి చోటు కల్పించాలనే విష యంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఈ లోపే నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం సాధ్యమైనంత వరకు ఈ నెల 5వ తేదీలోపే జరగనుందని తెలుస్తోంది.

సీఎం రేవంత్‌ (Revanth Reddy) గవర్నర్‌ రాధా కృష్ణన్‌తో (Radha Krishnan) సమావేశం కావడం కూ డా ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది. మంత్రివర్గ కూర్పు తుది నిర్ణయం కోసం సీఎం రేవంత్‌ రెడ్డి ఐదవ తేదీ లోపు ఏదో ఒక రో జు ఢిల్లీ పర్యటన పెట్టుకొనున్నా రు.మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీకి కొత్త చీఫ్‌ నియామకంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్‌గాంధీతో చర్చించేం దుకే సీఎం ఢిల్లీకి వెళుతున్నట్లు కాంగ్రెస్‌ (congress)వర్గాలు అంటున్నాయి. సీఎం తోపాటు డిప్యూటీ సీఎం భట్టివిక్ర మార్క సైతం వెళుతున్నట్లు, ఈ భేటీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, మంత్రి ఉత్తమ్‌కు మార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ కూడా పాల్గొంటారని స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి.

మంత్రివర్గ విస్త రణ(Cabinet expansion), టీపీసీసీ చీఫ్‌ అంశాలపై కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌, దీపాదాస్‌ ము న్షీ ఇప్పటికే రెండు దఫాలు సమా వేశమై చర్చించిన విషయం తెలిసిం దే. ఇదిలా ఉండగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని ఎంపిక కోసం ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్‌, ఎంపీ బలరాం నాయక్‌, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, మధు యాష్కి గౌడ్ తదితరుల పేర్ల ను ప్రతిపాదిత జాబితాలో చేర్చినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి, ముదిరాజ్‌ సామాజికవర్గం నుంచి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్‌రావు, ఎడ్మ బొజ్జు, నల్లగొండ జిల్లా నుంచి ఎమ్మె ల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బాలు నాయక్‌ తదితరుల పేర్లపై కేసీ వేణుగోపాల్‌తో జరిగిన పలు భేటీల్లో చర్చించినట్లు తెలిసింది. సదరు సమావేశాల తర్వాత హైద రాబాద్‌కు వచ్చిన దీపాదాస్‌ మున్షీ రాష్ట్రంలోని పలువురు ముఖ్యనేత లను కలిసి టీపీసీసీ కొత్త చీఫ్‌గా ప్రతిపాదిత పేర్లపై అభిప్రాయాలు సేకరించారని పార్టీ వర్గాలు తెలియ జేస్తున్నాయి. కేసీ వేణు గోపాల్‌తో (venu gopal) జరిపిన చర్చలు, రాష్ట్ర ముఖ్య నేత ల అభిప్రాయాల ఆధారంగా ఖర్గే, రాహుల్‌ టీపీసీసీకి కొత్త చీఫ్‌, మం త్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలి పాయి.