–పార్టీ, ప్రభుత్వ విషయాలు చర్చించిన నేతలు
–రైతు కృతజ్ఞత సభకు ప్రియాంకను ఆహ్వానించిన రేవంత్
Revanth Reddy:ప్రజా దీవెన,న్యూ ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఢిల్లీలో బిజిబిజిగా గడుపుతున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆదివారం కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని (Priyanka Gandhi) కలిశారు . సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపదాస్ మున్షీ రేవంత్ బృందంలో నుండి ఆమెను కలిశారు. నామినేటెడ్ పదవులు, కేబినెట్ విస్తరణ, వరంగల్ సభ గురించి ప్రియాంకతో నేతలు చర్చించినట్లు సమాచారం.కాగా, కాసేపట్లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహు ల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి (revanth reddy)భేటి కానున్నట్లు తెలిసింది. ఈ సంద ర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీ య అంశాలను వివరిం చడంతో పాటు రైతు రుణమాఫీ, రాష్ట్ర బడ్జె ట్ సెషన్ లో ఉండబోయే కీలక అంశాలను వివరించే చాన్స్ ఉంది. అలాగే ఈ నెలాఖరులో వరంగల్ లో రైతు కృతజ్ఞత సభను నిర్వ హించే అంశాలను హైకమాండ్ దృష్టి కి తీసుకెళ్లనున్నారు.ఈ సభ కు రాహుల్ గాంధీని ఆహ్వానించ నున్నట్లు ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినందున ఢిల్లీ పర్యటనలో రాహుల్‌ను కలిసి ఆహ్వానించను న్నా రు. అగ్రనేతలతో భేటీకి ముం దు పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ తో రేవంత్ భేటీ కానున్నారు. ఈ సమా వేశంలో పీసీసీ కొత్త చీఫ్ నియా మకం, కేబినెట్ విస్తరణ, నామినే టెడ్ పదవులపై చర్చించనున్నారు.
పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఢిల్లీ (Delhi)పర్యటనలో పొలిటికల్ అంశాలతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎం దృష్టి కేంద్రీకరించి నట్టు తెలిసింది. ఇందులో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో ఆయ న భేటీ కానున్నట్లు సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది. ప్రధానంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, జలశక్తి శాఖ, ఇతర శాఖల మంత్రుల అపాయింట్మెంట్లు కోరినట్లు సమాచారం.
గ్యాస్ రాయితీని ముందుగా చెల్లించoడి … కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల (Central Petroleum and Natural Gas) శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (revanth reddy) కలి శారు. తెలంగాణలో రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తోన్న విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. విని యోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (ఓఎంసీ) చెల్లించే అవకాశాన్ని కల్పించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. కేంద్రమం త్రిని కలిసిన వారిలో రేవంత్ రెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు.