Road Accident: ప్రజా దీవెన, ఛత్తీస్ ఘడ్: ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం కోర్బా జిల్లా మోర్గా చౌకీ పోలీస్ స్టేషన్ పరిధిలో వేగం గా వెళ్తూ అదుపు తప్పిన కారు మదన్ పూర్ లోయలోకి దూసు కెళ్లిoది. కారు 20 అడుగుల లోతై న గుంతలో పడగా అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.ప్రమా దంలో గాయపడిన ఇద్దరిని ఆస్ప త్రికి తరలించారు. కారులోని వ్యక్తు లు కుస్ముండా నుంచి సూరజ్‌పూ ర్‌కు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పొగమంచు ప్రధాన కారణంగా జరిగిన ఘట నలోకుస్ముండాకు చెందిన రుద్రేశ్వ ర్ గోండ్(36), మహేశ్ ప్రజాప తి(45)అనే ఇద్దరు మరణించగా ప్రమాదంలో గాయపడిన బిజిలీ ప్రజాపతి, శ్యామ్‌లాల్ ప్రజాపతిగా గుర్తించారు. ఎస్పీ యూబీఎస్ చౌహాన్ ప్రమాదాన్ని ధృవీకరిం చారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.