Road Accident: ప్రజా దీవెన, ఏలూరు: ఆంద్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో బుధ వా రం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) సంభవించింది. గూడ్స్ డీసీఎం మినీలారీ రూపంలో ఆవ హించడంతో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రం గా గాయపడ్డారు. డీసీఎం క్యాబిన్లో ఉన్న మరో ఇద్దరు సురక్షితంగా ఉ న్నారు. ప్రమాద సమయంలో డీసీ ఎంలో డ్రైవర్‌తో సహా 11 మంది కూలీలు ఉన్నట్లు సమాచారం. వివరాల్లోకెళ్తే ఏలూరు జిల్లా టి నరసాపురం (T Narasapuram)మండలం బొర్రంపా లెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడు తో బయల్దేరిన డీసీఎం మినీ లారీ బుధవారం తెల్లవారు జాము న రోడ్డుపై బోల్తా పడింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మం డలం తాడిమళ్లకు వెళ్తుండగా చిన్నయగూడెం శివారు వద్ద అదుపు తప్పి పంటబోదెలోకి దూసుకువెళ్లింది. అనంతరం చెట్ల పొదల్లో బోల్తా పడింది. దీంతో వాహనం ట్రక్కులో కూర్చుని ఉన్న తొమ్మిది మంది కూలీలు వాహనం కింద పడిపోయారు.
వాహనం (vehicle) తిరగబడటంతో జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకుని ఊపిరాడక ఏడుగురు కూలీలు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరిని తాడిమళ్లకు చెందిన ఘంటా మధుగా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల్లో ఏడుగురు తాడిమళ్లకు చెందిన వారిగా గుర్తించారు. సమిశ్రగూడెం మండలం తాడిమళ్లకు చెందిన దేవాబత్తుల బూరయ్య (40), తమ్మిరెడ్డి సత్యనారాయణ (45), పి.చినముసలయ్య (35), కత్తవ కృష్ణ (40), కత్తవ సత్తిపండు (40), తాడి కృష్ణ (45), నిడదవోలు మండలం కాటకోటేశ్వరానికి చెందిన బొక్కా ప్రసాద్.. అనే కూలీలు ఈ ఘటనలో మృతి చెందారు.ప్రమాదం అనంతరం డీఎస్పీ దేవకుమార్, ఎస్సైలు శ్రీహరిరావు, సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులు సహాయంతో బస్తాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం గాయపడిని వారిని ఆస్పత్రికి తరలించారు. మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. ప్రమాద సమయంలో క్యాబిన్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. వీరిలో డ్రైవర్ (driver) ప్రమాదం అనంతరం పరారయ్యాడు.