Road Accident: ప్రజా దీవెన, వెబ్ డెస్క్: అమెరికాలో(usa) ఆదివారం ఉదయం అక్కడి కాలమానం ప్రకారం జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) తెనాలికి చెందిన యువ వైద్యురాలు మృత్యువాత పడ్డారు. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్‌కు చెందిన జెట్టి హారిక వృత్తిరీత్యా పశువైద్యురాలు కాగా హారిక తండ్రి దేవాదాయ శాఖ ఉద్యోగిగా పని చేస్తున్నారు. తల్లిదం డ్రులు జెట్టి శ్రీనివాసరావు, నాగమ ణి ల కూతురు అయిన హారిక ఏడాదిన్నర క్రితం వెటర్నరీలో ఉన్నత చదువులు కోసం అమెరికా వెళ్ళింది. ఈ క్రమంలోనే తమ కారు లో ప్రయాణిస్తుండగా అనుకోకుం డా జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఆమె మరణించారు.
మృతదేహం కోసం భారత రాయబార కార్యాలయం (Embassy of India) వద్ద ఎదురుచూపులు చూస్తు న్నారు. ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కుటుం బసభ్యులు కోరుతున్నారు. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకొని హారిక మృతదేహా న్ని తెనాలికి వచ్చేందుకు సహకరిం చాలని విన్నవించుకుంటున్నారు. హారిక మరణ వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతు న్నారు. ఇదిలా ఉండగా భౌతిక కాయాన్ని వీలైనంత త్వరగా స్వస్థ లానికి తరలించేందుకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అమెరికాలో (usa)ని ఎన్ఆర్ఐలతో సంప్రదిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.