Robbery:ప్రజా దీవెన వరంగల్: తెలంగాణ లో దాడులు, దౌర్జన్యాల తీరు రోజు రోజుకు భయాందోళన పరిస్థి తుల కు దారితీస్తోంది. దొంగతనాలు, చై న్స్ స్నాచింగ్ లే కాకుండా తాజాగా దారిదోపిడి కేసులు కూడా నమోద వుతున్న తీరు గుబులు రేపుతోంది.ఫైనాన్స్ కంపెనీల ప్రోత్సాహంతో పలు కన్సల్టెన్సీ ల ముసుగులో కొంతమంది దుండగులు దారి దోపి డీలకు పాల్పడుతున్న సంఘ టన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.
గత రాత్రి లేబర్ కాలనీ నుండి ఏను మాముల వ్యవసాయ మార్కెట్ కు వెళ్లే 80 ఫీట్ల రోడ్డు లో, లారీ డ్రైవ ర్ పై పదిమంది యువకులు లారీపై ఫైనాన్స్ పెండింగ్ లో ఉందంటూ దారి దోపిడీకి ప్రయత్నించారు. డ్రైవర్ వద్ద ఉన్న డబ్బులను లా క్కొని లారీని సైతం ఎత్తుకెళ్లే ప్రయ త్నం చేయడం గమనార్హం. అడ్డుకో వడానికి ప్రయత్నించిన లారీ డ్రైవ ర్ ను లారీలో నుంచి తోసేయడం తో లారీ చక్రాల క్రింద చక్రాల కింద పడిపోయిన డ్రైవర్ కాలు నుజ్జు నుజ్జయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ప్రాణాలు దక్కినప్పటికీ తీవ్రగాయాలపాలయ్యాడు. స్థాని కులు పరిస్థితిని గమనించి అడ్డుకో వడంతో పరారయ్యారు. ఈ మే రకు ఏనుమాముల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది.