RTC should solve the problems of workers ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
-- సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం
ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
–సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం
ప్రజా దీవెన /నల్లగొండ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల మూలంగా ఆర్టీసీ మనగాడే ప్రమాదకరంగా మారిందని సిపిఐ జిల్లా కార్యదర్శి నెలికంటి సత్యం ఆరోపించారు. సోమవారం ఆర్టీసీని రక్షించండి- ప్రైవేటీకరణను ఆపాలని సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిoచారు. ఈ సందర్భంగా నెల్లికంటి సత్యం మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తూ ఆదాని అంబానీలకు దార దత్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అడుగుజాడల్లోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయాణం చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
బిజెపి విధానాన్ని నిరసిస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాలని ఆర్టీసీని బలోపేతం దిశగా ఈ ప్రభుత్వం ప్రయాణించాలని కోరారు. ఆర్టీసీఆర్టీసీలో యూనియన్ లను పునరుద్ధరణ చేసి ప్రజాస్వామిక పరిపాలన సాగించే దిశగా పాలకవర్గాలు ఉండాలన్నారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కె ఎస్ రెడ్డి అధ్యక్షతవహించగా ఈ సమావేశంలో సిపిఐ సీనియర్ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి, ఏఐటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి నగేష్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్ శ్రావణ్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బొల్గూరి నరసింహ ఎస్ డబ్ల్యూ ఎఫ్ నాయకులు కే నరసింహ, ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఏం రెడ్డి, మహిళా సమాఖ్య జిల్లా కన్వీనర్ గిరి రమా, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి టి వెంకటేశ్వర్లు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బరిగల వెంకటేష్ లెనిన్, ఆర్టీసీ నాయకులు శ్యాంసుందర్ సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.