Samineni Pramila :ప్రజా దీవెన, కోదాడ: సృష్టిలో అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్ అన్నారు కోదాడ కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు సయ్యద్ బాబా పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని స్థానిక శనగల రాధాకృష్ణ దివ్యాంగుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆమెపాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ అన్యం పుణ్యం తెలియని దివ్యాంగుల మధ్య బాబా పుట్టినరోజు జరుపుకోవడం అభినందనీయమని తెలిపారు బాబా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ నిరుపేదలను ఆదుకుంటూ తన దయాగుణాన్ని చాటుకుంటన్నారని తెలిపారు.
ప్రతి ఒక్కరూ పుట్టినరోజు సందర్భంగా జరుపుకునే వేడుకలకు లక్షల రూపాయలు ఖర్చు చేసే దానికంటే దివ్యాంగులకు ఒక రోజు అన్నదానం చేయటం ఎంతో పుణ్యమని తెలిపారు కోదాడ ప్రాంతంలో శుభకార్యాలయాలను దివ్యాంగుల మధ్య జరుపుకుంటే వారికి ఒకరోజు భోజనం పెట్టే వారవుతారని అది పుణ్యకార్యము అని తెలిపారు అలాగే అన్నదానం దాత బాబా మాట్లాడుతూ తన సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు కేటాయిస్తూ నిరుపేదలను ఆదుకుంటున్నానని అలాగే దివ్యాంగుల ఆశ్రమ అభివృద్ధికి తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డు కౌన్సిలర్లు మదర్ సాహెబ్ తిప్పిరి శెట్టి సుశీల రాజు, కైలాస్వామినాయక్ ఎస్.కె నజీర్ ఆశ్రమం నిర్వాహకులు శనగల రాధాకృష్ణ సిబ్బంది దివ్యాంగులు పాల్గొన్నారు