Samineni Pramila : ప్రజా దీవేన, కోదాడ: మున్సిపల్ పరిధిలోని స్థానిక నాలుగో వార్డ్ లో నివాసముంటున్న చిన్నం పెద్ద సైదులు అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు ఈ సందర్భంగా కోదాడ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సామినేని ప్రమీల మృతిడి నివాస గృహానికి వెళ్లి పార్థివదేహం పై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు అనంతరం ఆమె మాట్లాడుతూ పెద్ద సైజులు మంచి వ్యక్తిత్వంతో మానవతా విలువలతో కూడిన మంచి మనిషని ఆమె కొనియాడారు అనారోగ్యంతో మృతి చెందటం చాలా బాధాకరమని పెద్ద సైజులు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు .
ఈ సందర్భంగా కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి సంతాపాన్ని తెలిపారు సానుభూతి తెలిపిన వారిలో మాజీ వార్డ్ కౌన్సిలర్ సామినేని నరేష్, బిజెపి రాష్ట్ర నాయకులు కనకాల వెంకటరామయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు మందరపు అనంతరాములు ,వంగూరి గోపి, కుటుంబసభ్యులు తమ్ముడు చిన్నం జాను బాబు జనతా గ్యారేజ్ సభ్యులు అంబేద్కర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మృతునికి భార్య ,ఇద్దరు కుమార్తెలు,, ఒక కుమారుడు, ఉన్నారు