–జిల్లా కలెక్టర్ కు లేఖ రాసిన ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి.
Ootkur Drinking Water Funds :ప్రజా దీవెన, శాలిగౌరారం మే. 7: శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామం లో తాగు నీటి సమస్య పరిష్కారానికి 30 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ కి పంపిన లేఖ లో పేర్కొన్నారు.
ఊట్కూరు గ్రామంలో తాగు నీటి కి ప్రజలు అల్లాడుతున్నారని, భూ భారతి చట్టం అవగాహన సదస్సు లో గ్రామస్థులు ఖాళీ బిందెల తో నిరసన తెలిపారని, వెంటనే వారి దాహర్తిని తీర్చడానికి జిల్లా మినరల్ ఫండ్ గ్రాంట్ నుండి 30 లక్షలకు బడ్జెట్ మంజూరీ చేయాలని కలెక్టర్ కు విన్నవించారు.తక్షణమే నిధులు మంజూరీ చేసి గ్రామస్థులకు కృష్ణా తాగు నీటిని అందించాలని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.