Satti Babu : ప్రజా దీవేన, కోదాడ: పేదల ఆకలి తీర్చేందుకు స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్న అన్నదానానికి దాతలు సహకరం అభినందనీయమని కోదాడ మాజీ సర్పంచ్, ట్రస్ట్ గౌరవ సలహాదారులు పైడిమర్రి సత్తిబాబు అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ ఆవరణలో అర్వపల్లి భద్రమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఏర్పాటు చేసిన 319 వ అన్నదాన కార్యక్రమాన్ని ట్రస్టు సభ్యులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి ఆదుకోవడంలో మానసిక సంతృప్తి ఉంటుందని పేదల ఆకలి తీర్చేందుకు దాతలు చొరవ తీసుకొని ముందుకు రావాలన్నారు. 200 మందికి అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చారు గండ్ల రాజశేఖర్, పందిరి సత్యనారాయణ, రాయపూడి వెంకటనారాయణ, యాద సుధాకర్, వెంపటి వెంకటనారాయణ, పత్తి నరేందర్, సాయి, కొత్తూరు శ్రీనివాసరావు, వంగవీటి లోకేష్, రవికుమార్, బండారు శ్రీనివాసరావు, రామకృష్ణ, నాగేశ్వరరావు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.