Savitribai Phule: ప్రజా దీవేన, కోదాడ: పట్టణంలో BRS పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ నయీమ్ ఆధ్వర్యంలో సావిత్రి బాయి పూలే 129 వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షేక్ నయీమ్ మాట్లాడుతూ సమాజంలో అసమానతలపై, సాంఘిక దురాచారాలపై, అలుపెరుగని పోరాటం చేసి, వంటింటికే పరిమితమైన మహిళలకు చదువులు నేర్పించి సమాజంలో తలెత్తుకొని బతికేలా వారిలో చైతన్యం నింపిన మహనీయురాలు *సావిత్రి బాయి పూలే* ఆమె చేసిన కృషి, సేవలను, త్యాగాలను స్మరించుకుని వారి బాటలో మనం కూడా నడవాలని పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్స్ మేదర లలిత, BRS పార్టీ సీనియర్ నాయకులు మామిడి రామారావు ,అల్వాల్ వెంకట్,సంగిశెట్టి గోపాల్, కర్ల సుందర్ బాబు, చింతల లింగయ్య, షేక్ ఆదామ్, కాసాని మల్లయ్య, చలిగంటి వెంకట్, చీమ శ్రీనివాసరావు, బచ్చలకూరి నాగరాజు, మాదాల ఉపేందర్, సోమపంగు నాగరాజు,గొర్రె రాజేష్, బొర్రావంశీ, పంది శంకర్, వేముల వీరబాబు, రెడ్డెబోయిన నరేష్ యాదవ్, వెలిశాల పురుషోత్తమ్ తదితరులు పాల్గొని సావిత్రి బాయి పూలే కి ఘనంగా నివాళులు అర్పించారు..