Savitribai Phule: ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి సందర్భంగా మహిళా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు సింగం లక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తన తొమ్మిదవ వేట జ్యోతిరావు పూలే వివాహం చేసుకొని తన భర్త అడుగుజాడల్లో నడిచినటువంటి గొప్ప వీరనారి, ఆ రోజుల్లో స్త్రీలకు విద్య నిషేధించిన రోజుల్లో తన భర్త అయినటువంటి జ్యోతిరావు పూలే తన భార్యకు అయినటువంటి సావిత్రిబాయి పూలే కు విద్యాబుద్ధులు నేర్పించి 50 పాఠశాలలు నెలకొల్పి, వారు మహిళలోకాన్ని వెలుగు నింపడం కోసం ప్రయత్నం చేసిన గొప్ప దంపతులు. ఈ సమాజంలో అస్పృశ్యతని ఉన్నటువంటి మూఢనమ్మకాలని అటువంటి నాయకురాలు వారి విగ్రహాన్ని పార్లమెంట్లో అసెంబ్లీలో పెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేయడం జరిగినది.
ఇట్టి కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షులు మున్నాస ప్రసన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి కూరేళ్ల విజయకుమార్, జిల్లా కోశాధికారి జేరిపోతుల రమేష్ గౌడ్ అధికార ప్రతినిధి పుట్ట వెంకన్న గౌడ్ యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు బెల్లి నాగరాజు యాదవ్, యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెబోయిన సతీష్ యాదవ్ విద్యావంతుల యాదవ యాదవ కుల విద్యావంతుల వెంకన్న యాదవ్, కంచన పెళ్లి క్రాంతి,పలనాటి మోహన్ వల్ల కాటి శ్రీనివాస్, పగిళ్ల కృష్ణ, మోత్కూరు వెంకటాచారి, అంబడి బాత్క సతీష్, తాళ్లభద్రయ్య, రుద్ర లక్ష్మీనారాయణ,చిలుకూరి శ్రీనివాస్, దేవులపల్లి నర్సింహా, అల్లిసతీష్ యాదవ్, దొడ్డి కొర్ల లింగం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.