SC classification :ప్రజా దీవెన, శాలిగౌరారo: తెలంగాణ రాష్టంలో మాదిగల జనాభా దామాషా ప్రకారం మాదిగలకు రావాల్సిన 11శాంతం అమలు చేయాలని రేంవత్ రెడ్డి ప్రభుత్వంపై మంగళవారం శాలిగౌరారం మండలం లోని వివిధ గ్రామాల్లో ఎమ్మార్పిఎస్ ఆధ్వర్యంలో డప్పు బృందాలతో ప్రదర్శనలు చేశారు.
ఈ ప్రదర్శనలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మార్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు,ఉమ్మడి నల్గొండ జిల్లా కో-ఆర్డినేటర్ బోడ సునీల్ మాదిగ హాజరై మాట్లాడుతూ…
ఎస్సీ వర్గీకరణను అ శ్రాస్తీయంగా 9 శాంతం చేసారు కానీ మాదిగలకు రావాల్సింది శ్రాస్తీయ బద్దంగా 11 శాంతం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అలాగే (ఏ )గ్రూపులో ఉన్న మన్నే కులం, పంబాల కులాన్ని తీసి వేయాలి వర్గీకరణ వ్యతిరేక శక్తులకు గుణపాఠం చెప్పడానికి ఈ నెల 14 న నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించే మహా ప్రదర్శనకు ముఖ్య అతిథిగా,పద్మశ్రీ, మందకృష్ణ మాదిగ పాల్గొంటారని అన్ని మండల, గ్రామాల నుంచి మాదిగ మరియు మాదిగ ఉప కులాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పిఎస్ మండల ఇంచార్జ్ కారుపాటి అంబేద్కర్,సీనియర్ నాయకులు వంగూరి ప్రసాద్ కళా మండలి అధ్యక్షులు వేముల నాగరాజు, బట్ట సైదులు,మాచర్ల ప్రతాప్, గాదె రాజు,పనికెర రమేష్, దుప్పెల్లి వరుణ్,వేముల వెంకన్న, ఉడుగు యల్లయ్య, గూని యాదయ్య,ఎడ్ల నాగరాజు, గూని సైదులు, సూరారం మల్లేష్, వేముల శివ,ఊడుగు శంకర్, మందుల అజయ్,ఎడ్ల ప్రవీణ్,కొక స్వామి ,దాసరి శంకర్ , బోడ బన్ని కార్యకర్తలు పాల్గొన్నారు.