Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SC Reservations : ఎమ్మార్పీఎస్, ఎం.ఎస్.పి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు

SC Reservations : ప్రజా దీవేన, కోదాడ: SC రిజర్వేషన్ల వర్గీకరణ చట్ట రూపం దాల్చే వరకు తెలంగాణలో గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగ ఫలితాలను నియమాకాలను వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కోదాడ నియోజకవర్గ కేంద్రంలో
MRPS జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి సత్యరాజు మాదిగ, MRPS కోదాడ మండల అధ్యక్షులు పిడమర్తి చిన్న వెంకట్రావు మాదిగ ఆధ్వర్యంలో గురువారం 2 వ రోజు చేపట్టిన నిరసన దీక్ష కార్యక్రమాని నిర్వహించారు బిజెపి రాష్ట్ర నాయకులు జల్లా జనార్ధన్ రావు బిజెపి దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు వంగాల పిచ్చయ్య దీక్షకు మద్దతు మరియు సంఘీభావాన్ని ప్రకటించిన అనంతరం మాట్లాడుతూ.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని చెబుతూనే
మరోవైపు ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో చట్టం చేయకుండా కాలయాపన చేస్తూ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఉద్యోగ ఫలితాలను నియమాకాలను విడుదల చేస్తూ మాదిగ మాదిగ ఉపకులాలకు తీరని అన్యాయం చేస్తున్నాడని తెలిపారు స్వార్ధపర వర్గీకరణ వ్యతిరేక శక్తులకు రాష్ట్ర ప్రభుత్వం తలవొగ్గి వర్గీకరణ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు దానికి ప్రభుత్వం మాదిగల చేతుల్లో తగిన రాజకీయ మూల్యం తప్పదని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వర్గీకరణ ప్రక్రియను శాస్త్రీయంగా న్యాయబద్ధంగా అన్ని ఉపకులాలకు సామాజిక న్యాయం జరిగే విధంగా చట్టం చేయాలని తెలుపుతూ అప్పటిదాకా ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టారాదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూమని తెలిపారు ఈ కార్యక్రమంలో
MSP జిల్లా అధికార ప్రతిదీ ఏపూరి రాజు మాదిగ ,MSP రాష్ట్ర నాయకులు యలమర్తి రాము మాదిగ, MRPS జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి సత్యరాజు మాదిగ, MRPS కోదాడ మండల అధ్యక్షుడు పెడమర్తి చిన్న వెంకట్రావు మాదిగ, కొండపల్లి సూర్యప్రకాష్ మాదిగ,
MSP జిల్లా సహాయ కార్యదర్శి కొండపల్లి జాను మాదిగ,
ఆకారం ఆకారపు కొండలు మాదిగ, MRPS, MSP పట్టణ నాయకులు గురునాథం, ఏపూరి శ్రీను, కుడుముల చింటూ, ఏపూరి రమేష్, సుబ్బారావు లు