–బంద్ కు అన్ని వర్గాల వ్యాపార, విద్యాసంస్థలు సహకరించాలి
–బీసీ నేత లింగం గౌడ్ విజ్ఞప్తి
Telangana Bandh SC ST : ప్రజా దీవెన, హైదరాబాద్: ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయాలని బీసీ సం క్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జా జుల లింగంగౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 18న జరిగే తెలంగాణ బంద్ కు మద్దతుగా ఉస్మానియా యూని వర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగ ణంలో జరిగిన సమావేశంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థి మరియు బహుజన సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సం ఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లిం గంగౌడ్ మాట్లాడారు.
ఈ రాష్ట్ర బంద్ ద్వారా బీసీల ఐక్య తను చైతన్యాన్ని చాటి చెప్పాలని బీసీలకు జరుగుతున్న అన్యాయా న్ని దేశానికి వినిపించడం కోసమే బంద్ చేయాల్సి వస్తుందని బీసీల కు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆపేది లేదని ఆయన హెచ్చరించా రు.బీసీలకు న్యాయబద్ధంగా రావల సిన రిజర్వేషన్లను కోర్టులను వేదిక లుగా చేసుకొని అగ్రకులాలు అడు గడుగునా అడ్డుకుంటున్నారని, ఇ ది ఎంతవరకు సమంజసం అని ఆ యన ప్రశ్నించారు.బీసీల ఆత్మభి మానాన్ని దెబ్బతీస్తూ బీసీల రిజ ర్వేషన్లను తగ్గించాలని కుట్రలు చేసే వాళ్లకు బుద్ధి చెప్పేలా బీసీలు ఉద్య మించే సమయం ఆసన్న మైంద న్నారు.
ఈ కార్యక్రమంలో ఈరెంటి విజయ మాదిగ ఎమ్మె స్ఎఫ్ రాష్ట్ర అధ్య క్షులు, గద్దల అంజిబాబు ఓయు జెఏసి, నూకమల్ల వీరస్వామి మాల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బూర శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ విద్యార్థి యువజన పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు, టిఎంఎస్ ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్, నామ సైదులు హంస ఓయూ అధ్యక్షులు జి నర్సిం హు లు, ఎమ్మెస్ ఎఫ్.టి రాష్ట్ర అ ధ్యక్షు లు డి సంజీవ, ఎంఎ స్సీ రాష్ట్ర అ ధ్యక్షులు ఓంకార్ సాయి ర వికిరణ్ బాలకృష్ణ రవీందర్ రమేష్ నాయక్ తదిత రులు పాల్గొన్నారు.
BC leader lingam goud comments on BC reservations at osmania university pic.twitter.com/PqtXBXmFlH
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) October 16, 2025