స్క్రీనింగ్ కొనసాగుతోంది
— కాంగ్రెస్ అభ్యర్థుల వడపోత షురూ
ప్రజా దీవెన/ హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఫైనల్ చేసేందుకు హైదరాబాద్ చేరుకున్న స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ కె.మురళీధరను శంషా బాద్ విమానాశ్రయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు.
కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు పెరుగుతున్న గ్రాఫ్ నేపథ్యoలో 119 అసెంబ్లీ స్థానాలకు భారీ ఎత్తున పోటీ నెలకొన్నది. సిట్టింగులు, మాజీలు, సీనియర్ల క్రైటీరియాతో దాదాపు 25 నుంచి 30 సీట్లు ఇప్పటికే ఫైనల్ కాగా మిగతా సెగ్మెంట్లలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరంగా సాగుతుంది.
కాగా తాజాగా జరిగిన పీఈసీ సమావేశంలో ఆయా సెగ్మెంట్లకు ముగ్గురు అభ్యర్థుల చొప్పున కమిటీ సభ్యులు మార్క్ చేసినట్లు సమాచారం. మూడు రోజులపాటు స్క్రీనింగ్ కమిటీ పీఈసీ సభ్యుడితో ఒక్కో పీఈసీ ముఖాముఖి నిర్వహించనుంది. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ లో 28 మంది పీఈసీ సభ్యులు ఉన్నారు.