–వ్యకాస రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య
Secretary Nari Ilayya :ప్రజాదీవెన నల్గొండ టౌన్ : ప్రతి వ్యవసాయ కార్మికునికి 25 కిలోల సన్న బియ్యం ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య డిమాండ్ చేశారు. మంగళవారం నల్గొండలోని దొడ్డి కొమరయ్య భవన్లో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఆఫీసు బేరర్స్ సమావేశంలో, ఐలయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలకు ఒక్కొక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. నెల అంతా ఆరు కిలో సరిపోవని వ్యక్తికి 25 కిలోలు చొప్పున ఇస్తే మనిషి జీవించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.
జిల్లావ్యాప్తంగా ఉపాధి కార్మికులకు రెండు నెలల పెండింగ్ బిల్లులు ఉన్నాయని చట్టంలో పనిచేసిన కూలీలకు 15 రోజులకు ఒకసారి వేతనాలు ఇవ్వాలని ఉన్న కేంద్ర బడ్జెట్లో నిధులు తగ్గించడం మూలంగా చేసిన పనులకు డబ్బులు ఇవ్వలేని స్థితి ఏర్పడిందని పెండింగ్ బిల్లులు పెద్ద ఎత్తున ఉండడం మూలంగా వ్యవసాయ కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడకుండా రాష్ట్ర బడ్జెట్లో 15శాతం ఉపాధికి నిధులు కేటాయించాలని ఎండలు తీవ్రతరమైన నేపథ్యంలో రెండు పూటలు పనిచేయాలనె విధానానికి స్వస్తిపలికి ఒక్కపూట పని పెట్టాలని పనిచేసే చోట కనీసం సౌకర్యాలైన నీరు నీడ మెడికల్ కిట్టు లాంటి సౌకర్యాలు కల్పించాలని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ భరోసా కింద 12,500 ప్రతి కుటుంబానికి ఇస్తానని చెప్పి నేటికీ సంవత్సరం, నాలుగు నెలలు గడిచిన ఇవ్వలేదని వెంటనే ఆత్మీయ భరోసా తోపాటు 50 ఏళ్లు నిండిన వ్యవసాయ కార్మికులందరికీ వెంటనే పెన్షన్లు ఇచ్చి వ్యవసాయ కార్మికులు ఆదుకోవాలని అన్నారు.వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొజ్జ చిన్న వెంకులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దండంపల్లి సరోజ, కత్తుల లింగస్వామి, ఉడుగుండ్ల రాములు, ఆర్. రవి నాయక్, చింతపల్లి లూర్దు మారయ్య, సుకన్య తదితరులు పాల్గొన్నారు.