Selfishness during general elections.సార్వత్రిక ఎన్నికల సమయంలో స్వార్థం…!
-- సిద్ధాంతాలకు తిలోదకాలిస్తున్న తరుణం -- ఉన్నఫలంగా ఉల్టాఫల్టావుతున్న 'రాజకీయo' -- సంకట స్థితిలో వర్ణాలు మారుస్తున్న నేతలు -- ఆధిపత్యం కోసం అడ్డదారుల్లో పార్టీలు -- సకల అవకాశాల కోసం ఎదురుచూపులు
సార్వత్రిక ఎన్నికల సమయంలో స్వార్థం…!
— సిద్ధాంతాలకు తిలోదకాలిస్తున్న తరుణం
— ఉన్నఫలంగా ఉల్టాఫల్టావుతున్న ‘రాజకీయo’
— సంకట స్థితిలో వర్ణాలు మారుస్తున్న నేతలు
— ఆధిపత్యం కోసం అడ్డదారుల్లో పార్టీలు
— సకల అవకాశాల కోసం ఎదురుచూపులు
ప్రజా దీవెన/ హైదరాబాద్: తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో ‘రాజకీయం ‘ ఊసరవెల్లి పాత్ర పోషిస్తుంది. సిద్ధాంతపరమైన తిలోదకాలిస్తూ అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ఆరాటపడుతున్నాయి. సంకట స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కొందరు నేతలు ఉల్టా పల్టా రాజకీయంకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు.
అవకాశం మేరకు రాజకీయ రంగులు మారుస్తూ ఆదిపత్యo కోసం అన్ని రకాలుగా సిద్ధం చేసుకుంటున్నారు. ఈ విషయంలో అధికార బి అర్ ఎస్ పార్టీలో జోష్ పెరుగుతుండగా ప్రతిపక్ష పార్టీల్లో కొంత సంకట పరిస్థితి కొనసాగుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ పరిస్థితి కళ్లకు కట్టినట్టు కనబడుతోంది.
సార్వత్రిక ఎన్నికల్లో అవకాశం కోసం ఎదురు చూసి భయపడిన నేతలు వారి అనుచరులు పదుల సంఖ్యలో పార్టీలు మారేందుకు కసరత్తు ప్రారంభించారు. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ స్వార్థం స్పష్టంగా కనబడుతుంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లో ఈ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా అధికార బీఆర్ఎస్ లోనూ తెరచాటుగా అంతకంత పరిణామాలు కొనసాగుతున్నాయి.
అధికార పార్టీ అభ్యర్థుల ప్రకటన తర్వాత అక్కడక్కడా కొత్త స్వరాలువినిపించడం ఆయా పార్టీలకు శాపంగా పరిణమించనుందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయ వర్ణాలు మారే పరిస్థితి చక చకా జరిగిపోతుంది.
ఎవరు ఏ పార్టీ నుంచి పక్క పార్టీకి రంగు పులుముకుంటారో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లా లో ఊహించని విధంగా ఆ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ చేరగా మరొకొందరు అదే బాటలో ఉన్నారన్న సంకేతాలు వ్యక్తవమవుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు తమను పార్టీలో ఎదగనీయడం లేదని, షాడో నేతల కోసమే ఉత్సాహం చూపుతున్నట్లు బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అధికార బీఆర్ఎస్ ఆయా పార్టీల్లో అసంతృప్తిని ఎన్కాష్ చేసుకునేందుకు మాటు వేసి ఎదురుచూస్తుంది.