–మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలం గాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ
Journalist Swetcha Ardhantar : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్ర శ్నించి, సమస్యలు పరిష్కరించిన సీనియర్ జర్నలిస్టు స్వేచ్ఛ అర్ధాంత రంగా మృతి చెందడం బాధాకర మ ని వక్తలు పేర్కొన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలం గాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జ ర్నలిస్ట్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ “స్వే చ్ఛ యాదిలో ” కార్యక్రమం ద్వారా జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మం త్రి శ్రీని వాస్ గౌడ్, తెలంగాణ మీడియా అ కాడమీ మాజీ చైర్మన్ అల్లం నారా యణ, సీనియర్ సంపాదకులు కే శ్రీనివాస్, టియుడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, సీనియ ర్ జర్నలిస్టు రమణ కుమార్, యో గానంద్, నవీన్ కుమార్ యార, బా పూరావు, గోపరాజు, కవిత, అవ్వా రి భాస్కర్ తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
సీనియర్ పాత్రికేయులు సరిత అ ధ్యక్షన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లా డుతూ స్వేచ్ఛ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల ని, దోషులకు కఠిన శిక్ష పడేలా పో రాటం చేద్దామని అన్నారు. తన కూ తురు చదువులకు ఆర్థికంగా సహా యం చేసి ఆదుకుంటానని ఈ సం దర్భంగా హామీ ఇచ్చారు.
మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నా రాయణ మాట్లాడుతూ ఒక చిన్న పి ల్ల తన తండ్రి వద్దకు ఎలా వస్తుం దో స్వేచ్ఛ అలా తన దగ్గరకు వచ్చే దని ఈ సందర్భంగా గుర్తు చే చేసు కున్నారు. ఎంతో తెలివిగా చర్చలు నిర్వహించే మహి ళా జర్నలిస్టుల్లో స్వేచ్ఛ ముందు వరుసలో ఉండేది అన్నారు.
ఏ మీడియా అయినా వ్యక్తిగత జీవి తంలోకి తొంగి చూడడం సరికాదని, మృతి తర్వాత యూట్యూబ్ ఛాన ల్స్ స్వేచ్ఛ ను మరో మారు చంపే ప్ర యత్నం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన తర్వా త నైనా వారి కుటుంబాన్ని స్వేచ్ఛ గా ఉండనిద్దామని, మృతికి కారకు డైనా పూర్ణకు శిక్షపడేలా అందరం పోరాడాల్సిందన్నారు. స్వేచ్ఛ పని చేసిన మీడియా యాజమాన్యంతో మాట్లాడి తన కుటుంబానికి ఆర్థిక సాయం చేసేందుకు ప్రయత్నం చే స్తామని టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సీని యర్ జర్నలిస్ట్ లు రాకేష్ రెడ్డి, సో మేష్, సూరజ్,లక్ష్మీనారాయణ, అమిత్ భట్టు, బుచ్చన్న, ప్రియా, మల్లీశ్వరి,ఈశ్వరి,కరుణ,బిజిగిరి శ్రీనివాస్, ఆగస్టిన్ తదితరులు పా ల్గొన్నారు.