Praja Deveena
Newspaper Banner
Date of Publish : 03 November 2025, 2:32 pm Posted by : praja deveena

District Collector Ila Tripathi : విద్యార్థులకు ఉపాధిఅవకాశాల కోసం సెట్విన్ వృత్తిపరమైన శిక్షణ కార్యక్రమాలు

— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: పది,ఇంటర్ చదువు తర్వాత విద్యార్థులు ఉపా ధి అవకాశాలు పొందేందుకుగాను సెట్విన్ ఆధ్వర్యంలో వృత్తిపరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించను న్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తె లిపారు. ఈ కార్యక్రమాలలో భాగం గా జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీ లు, మోడల్ స్కూల్ విద్యార్థులకు మండలాల ప్రత్యేక అధికారులు, సంక్షేమ అధి కారులు అవగాహన కల్పించాల న్నారు. ప్రత్యేకించి మ హిళలకు ఉ ద్దేశించి బ్యూటిఫికేషన్, ఫ్యాషన్ డి జైనింగ్ వంటి కోర్సులు కూడా ఇం దులో ఉన్నాయని తెలిపారు. సో మవారం ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదుల స్వీకరణ అనంతరం ఆ మె జిల్లా అధికారులతో మాట్లాడా రు. సెట్విన్ ద్వారా కల్పించే వృత్తిప రమైన కోర్సుల శిక్షణ లో భాగంగా ఈనెల 4న నల్గొండ జిల్లా కేంద్రం స మీపంలోని రామ్ నగర్ అల్ప సం ఖ్యాక వర్గాల రెసిడెన్షియల్ పాఠ శాలలో ప్రారంభిస్తున్నట్టు ఆమె తె లిపారు.

సెట్విన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణ తరగతులకు నామమాత్ర పు ఫీజు చెల్లించి వలసి ఉంటుంద ని, ఎవరైనా ఫీజు చెల్లించలేని పరి స్థితిలో ఉన్న అతి పేద విద్యార్థు ల కు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహ యం అందిస్తామని ఆమె వెల్లడిం చారు.సెట్విన్ ఇచ్చే శిక్షణ కోర్సుల లో భాగంగా సుమారు( 26) రకాల కోర్సులు ఉన్నాయని, వాటిలో కం ప్యూటర్ కోర్సులు, మహిళలకు ఉ ద్దేశించిన ప్రత్యేక కోర్సులు, ఎడ్యుకే షన్ కోర్సులు, టెక్నికల్ కోర్సులు ఉ న్నాయని, ఇవన్నీ 3 నుండి 6 నె లల స్వల్పకాల వ్యవధి శిక్షణ కా ర్యక్రమాలు ఉంటాయని, వీటిలో శిక్షణ పొందడం ద్వారా 10, ఇంట ర్మీడియట్ వంటి విద్య పూర్తయిన వెంటనే ఏదైనా రంగంలో ఉపాధి పొందేందుకు అవకాశం ఉంటుంద ని, శిక్షణ పొందిన వారికి సెట్విన్ ద్వారా సర్టిఫికెట్ ఇవ్వడం జరుగు తుందని ఆమె వెల్లడించారు.

పాఠశాల సమయం ముగిసిన త ర్వాత శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ శిక్షణా కార్య క్ర మాల వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వా సం పెంపొందుతుందని చెప్పారు. జిల్లాలో ఉన్న రెసిడెన్షియల్ కె జి బి వి పాఠశాలల విద్యార్థులు దీని ని సద్వినియోగం చేసుకోవాలని కో రారు. ఈ సమావేశంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఇ న్చార్జి డిఆర్ఓవై. అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, చండూరు, దేవరకొండ ఆర్డిఓలు శ్రీదేవి, రమణారెడ్డి, జిల్లా అధికారు లు ఉన్నారు.